Honey & Clove Benefits: తేనెతో కలిపి లవంగాలను తీసుకుంటే ఈ సమస్యలు ఫసక్.. అవెంటో తెలుసుకోండి..

|

Nov 02, 2021 | 7:43 PM

తేనె ఆరోగ్యానికి చేసే మేలు గురించి అందరికి తెలిసిన విషయమే. అలాగే లవంగాలు కూడా ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి.

Honey & Clove Benefits: తేనెతో కలిపి లవంగాలను తీసుకుంటే ఈ సమస్యలు ఫసక్.. అవెంటో తెలుసుకోండి..
Clove And Honey
Follow us on

తేనె ఆరోగ్యానికి చేసే మేలు గురించి అందరికి తెలిసిన విషయమే. అలాగే లవంగాలు కూడా ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే ఇప్పటివరకు ఈ రెండింటిని విడి విడిగా ఉపయోగించి ఉంటారు. కానీ.. తేనె, లవంగాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలున్నాయ. ఈ రెండింటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువలన పల అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇక చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను నియంత్రంచడంలోనూ ఇవి రెండు ఎక్కువగా పనిచేస్తాయి. అవెంటో తెలుసుకుందామా.

చలికాలంలో కలిగే.. దగ్గు, గొంతు నొప్పి సమస్యలను తగ్గించడంలో తేనె, లవంగాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇందుకోసం మూడు లవంగాలను మెత్తగా పొడి చేసి అందులో చెంచా తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వలన దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గొంతు నొప్పి, ఇన్పెక్షన్స్ నియంత్రించడంలో సహయపడుతుంది.

తేనె.. లవంగాలను కలిపి తీసుకోవడం వలన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడుతుంది. అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడంలో సహయపడుతుంది. ఇందుకు మూడు లవంగాలను పొడి చేసి స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.

తేనె.. లవంగాలు కలిపి తీసుకోవడం వలన బరువు తగ్గడంలోనూ సహయపడుతుంది. అంతేకాదు.. ఈ రెంటింటిని టీగా కూడా తీసుకోవచ్చు. ఈ రెండు కేలరీలను బర్న్ చేయడమే కాకుండా..ఆకలిని తగ్గిస్తాయి. అలాగే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది.

నోటి పూతల నుంచి ఉపశమనం పొందడానికి తేనె, లవంగాల మిశ్రమం ఎక్కువగా పనిచేస్తుంది. ఇందుకు చెంచా తేనెలో లవంగాల పొడిని కలిపి పేస్ట్ లా చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను అల్సర్ లపై అప్లై చేయాలి.

Also Read: Suriya & Jyothika: సూర్య రొమాంటిక్‌ పర్సన్‌… అందుకే నాకెక్కువ టెన్షన్‌!.. ఆసక్తికర విషయాలను చెప్పిన జ్యోతిక..

Bigg Boss 5 Telugu: కలుసుకున్న బిగ్‏బాస్ ఎలిమినేట్ కంటెస్టెంట్స్… కానీ తను మాత్రమే మిస్..

Shyam Singha Roy: తిరగబడిన సంగ్రామం.. వెనకబడని చైతన్యం.. అంచనాలను పెంచేసిన శ్యామ్ సింగరాయ్..