సాధారణంగా మన ఇళ్లలో ఎండు కొబ్బరిని వంటల్లో ఉపయోగించడం.. లేదా స్వీట్స్, ఐస్ క్రీంస్, ఖీర్, స్వీట్ డిష్స్ తయారీ చేయడంలో ఉపయోగిస్తారు. అలాగే వంట రుచిని పెంచడంలోనూ ఎండు కొబ్బరి ప్రధానంగా పనిచేస్తుంది. అయితే కొందరు మాత్రం ఎండు కొబ్బరిని తినడానికి అస్సలు ఆసక్తి చూపించరు. కొబ్బరితో చేసిన స్వీట్స్ కానీ.. వంటలలో వేసేందుకు కానీ ఇష్టపడరు కానీ ఈ ఎండుకొబ్బరిలో అనేక పోషకాలున్నాయన్న సంగతి తెలుసా. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ సహయపడుతుంది. అలాగే శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. ఇవే కాకుండా. చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఈ ఎండిన కొబ్బరి తినడం వలన ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందామా.
1. కొబ్బరిలో ఫినోలిన్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి శరీర కణాల ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తాయి. అలాగే గల్లిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, పి-కొమరిక్ యాసిడ్ ఉన్నాయి. ఎండిన కొబ్బరి శరీరంలో రక్త ప్రవాహాన్ని సరిగ్గా ఉంచుతుంది.
2. అలాగే ఇది ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. మహిళలల్లో ఎక్కువగా ఐరన్ లోపం కలుగుతుంది. ఎండిన కొబ్బరిలో ఐరన్ చాలా ఎక్కువగా మోతాదులో ఉంటుంది. తరచూ కొబ్బరి తినడం వలన ఐరన్ సమస్య తగ్గుతుంది. మహిళలు డెలివరీ తర్వాత కొబ్బరి స్వీట్స్ తినాలి.
3. ఎండిన కొబ్బరిలో ప్రోటీన్స్, విటమిన్స్ ఐరన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం కనిపిస్తాయి. ఈ పోషకాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా.. శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
4. అలాగే ఎండిన కొబ్బరి బంధన కణజాలాలకు మేలు చేస్తుంది. కొబ్బరి శరీరంలోని బంధన కణజాలాలను బలోపేతం చేసే అనేక పోషకాలను కలిగి ఉంటుంది. కొబ్బరిని ఆహారంలో చేర్చడం వలన ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా… చర్మానికి మేలు చేస్తుంది.
5. పొడి కొబ్బరి తినడం వలన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యానికి ఎండు కొబ్బరి చాలా ముఖ్యం. కొబ్బరి నూనె అల్జీమర్స్ నివారించడానికి సహయపడుతుందని.. ఇటీవల పలు అధ్యాయనాల్లో తెలీంది.
Also Read: Kondapolam: వైష్ణవ్ తేజ్ సినిమా రిలీజ్ డేట్ మారిందా ? కొండపొలం ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పడంటే..
love story: నాగచైతన్య, సాయి పల్లవిల అందమైన ప్రేమకథ.. ప్రేక్షకుల ముందుకు లవ్ స్టోరీ వచ్చేది రేపే..