Diabetes Cure: షుగర్ పేషెంట్లకు దివ్య ఔషధం.. గుమ్మడి గింజలతో చక్కెరకు చెక్.. ఎలా తినాలో తెలుసా..

|

Jun 06, 2022 | 2:57 PM

Pumpkin Seeds Benefits: గుమ్మడి కాయ గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రుచికరంగా ఉంటాయి. అలాగే శక్తిని ఇస్తాయి. గుమ్మడికాయ విత్తనాల్లో విటమిన్లు ఎ, సి, ఇలతోపాటు ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు శరీర ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి. వీటిని ఎలా తినాలంటే..

Diabetes Cure: షుగర్ పేషెంట్లకు దివ్య ఔషధం.. గుమ్మడి గింజలతో చక్కెరకు చెక్.. ఎలా తినాలో తెలుసా..
Pumpkin Seeds
Follow us on

మధుమేహ బాదితులకు శరీరంలోని చక్కెర శాతంను నియంత్రించడం చాలా ముఖ్యం. షుగర్‌ని నియంత్రించాలంటే నిత్యం మందులపై ఆధారపడకుండా మందులతో పాటు డైట్‌తో షుగర్‌ని నియంత్రించాల్సి ఉంటుంది. చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉండే ఆహారంలో అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. ఇందులో గుమ్మడికాయ గింజలు చక్కెరను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు అయ్యింది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న గుమ్మడి గింజలు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని లోపలి నుంచి చల్లగా ఉంచుతాయి, అలాగే మధుమేహాన్ని నియంత్రిస్తాయి. గుమ్మడి గింజల్లో మినరల్స్, విటమిన్లు, ఆరోగ్యానికి ఉపయోగపడే అధిక పీచు ఉంటుంది. విటమిన్ కె , విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న ఈ గింజలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు ఎముకలను బలోపేతం చేస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండే ఈ గింజలు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఈ గింజలు మధుమేహాన్ని ఎలా నియంత్రిస్తాయి. శరీరానికి దాని వల్ల కలిగే ప్రయోజనాలను ఓసారి తెలుసుకుందాం.

చక్కెరను నియంత్రిస్తుంది

మధుమేహంలో గుమ్మడి గింజలను చిరుతిండిగా తీసుకోవచ్చు. గుమ్మడికాయ గింజలు చక్కెరను నియంత్రించడంలో చాలా ప్రభావవంతమైనవని రుజువు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.

గుమ్మడి గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను తగ్గిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర కణాలను తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ చేయడానికి సమయం పొందుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణంగా ఉంటుంది. మధుమేహం సమయంలో శరీరంలో తీవ్రమైన ఎంజైములు ఉత్పత్తి అవుతాయి. ఇది శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. డయాబెటిక్ రోగులు గుమ్మడికాయ గింజలను తినేడం వల్ల ఈ ఎంజైములు క్రియారహితం అవుతాయి. ఈ గింజలను తీసుకోవడం ద్వారా మధుమేహం ముప్పును దూరం చేసుకోవచ్చు.

గుమ్మడికాయ గింజల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఇవి..

  • గుమ్మడికాయ గింజలు బరువును నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఈ గింజలు ఆకలిని అణచివేస్తాయి. అతిగా తినకుండా చేస్తుంది.
  • గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుమ్మడి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

షుగర్ పేషెంట్లు గుమ్మడి గింజలను ఈ విధంగా తీసుకోవాలి: మధుమేహాన్ని నియంత్రించడానికి షుగర్ రోగులు గుమ్మడి గింజలను వేయించిన తర్వాత తినాలి. ఈ గింజలను వేయించి గ్రైండ్ చేసి సలాడ్‌లలో లేదా ఆహారంలో కలుపుకుని తింటే ఇంకా మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ న్యూస్ కోసం..