గోర్లు కోరకడం చాలా మందికి ఉన్న అలవాటు..చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వారి వరకు నూటికి డెబ్బై శాతం మందికి ఈ గోర్లు కోరకడం.. నమలడం అలవాటు ఉంటుంది.. అయితే చిన్నపిల్లల పదే పదే గోర్లను కోరుకుతుంటే.. పెద్దవాళ్లు మాత్రం కోపం వచ్చినప్పుడు.. తీక్షణంగా ఆలోచిస్తున్నప్పుడు ఇలా గోర్లు కొరుకుతుంటారు. ఈ అలవాటు మంచిది కాదని పెద్దవాళ్లు చెబుతుంటారు. చిన్నపిల్లలు పదే పదే గోర్లు కోరుకుతుంటే వద్దని వారిస్తుంటారు. నిజమే.. గోర్లు కోరికితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ గోర్లు కొరికే అలవాటును వైద్య భాషలో ఒనికోఫాగియా అంటారు. ఇది ఒక మానసిక స్థితి. ఎక్కువగా ఒత్తిడి..ఆందోళన ఉన్నప్పుడు కచ్చితంగా గోర్లు కొరుకుతుంటారు.
అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ (APA) ప్రకారం.. గోర్లు కొరకడం చాలా బలవంతంగా ఉంటుంది. నివేదికల ప్రకారం.. ఇది ఒక వ్యాధి.. మనసులోని అసంఘటిత ఆలోచనలు..ఉద్ధీపనలు వస్తాయి. కోపం.. ఒత్తిడి.. నిస్సహయత స్థితిలో ఉన్నప్పుడు గోర్లు కొరుకుతుంటారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తల ప్రకారం.. గోర్లు కొరికే అలవాటుకు చాలా కారణాలు ఉంటాయి. ఇందులో జన్యుపరమైన అంశాలు కూడా ఉండవు. మానసిక ఆందోళన.. ఒత్తిడి ఉన్నప్పుడు గోర్లు కొరుకుతుంటారు. అయితే గోర్లు కొరకడం.. నమలడం వలన ఒత్తిడి.. టెన్షన్.. నీరసం తగ్గుతుందని తెలీంది. సాధారణంగా కొందరు వ్యక్తులు.. ఒంటరిగా ఉన్నప్పుడు.. ఆకలిగా అనిపించినప్పుడు కూడా గోర్లు కొరుకుతుంటారు.
గోర్లు కొరకడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముందుకు మానసిక సమస్యలకు దారితీస్తుంది. వీరు రాను రాను ఎక్కువగా భావోద్వేగంగా.. విచారంగా ఉంటారు. అదే సమయంలో సామాజికంగా బలహీనతలకు లోనవుతాడు. గోర్లు నమలడం.. కొరకడం వలన అనేక ఇన్ఫెక్షన్ల బారీన పడే అవకాశం ఉంటుంది. గోర్లు కొరడం వలన వాటి చుట్టు ఉండే స్కీన్ కడుపులోకి వెళ్లి పరాన్న జీవులకు చేరే ప్రమాదం ఉంది. దీంతో కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. పొత్తి కడుపులో వాపు.. దవడలో నొప్పి.. చిగుళ్ల గాయమయ్యే ప్రమాదాలు ఉంది. అంతకాకుండా.. దంతాలు.. నోటిని దెబ్బతింటుంది. అలాగే.. బ్యాక్టీరియా.. ఫంగస్ దాడి చేసే అవకాశం ఉంది. దీంతో అనేక వ్యాధులు వస్తాయి.
గోర్లు కొరికే అలవాటును మానేయాలంటే.. మౌత్ గార్డ్ అప్లై చేయడం వలన ఈ అలవాటు తగ్గుతుంది. గోళ్లలో పదునైన చేదుగా ఉండే నెయిల్ పాలిష్ వేసుకోవడం వలన గోర్లు కొరికే అలవాటు తగ్గుతుంది. చేదుగా ఉండే నూనెను గోర్లపై అప్లై చేయడం వలన కూడా ఈ అలవాటు మానేయవచ్చు. ఎల్లప్పుడు గోర్లను కొరికే అలవాటు ఉంటే.. వాటిని చిన్నగా ఉండేలా చూసుకోవాలి.
Also Read: Ram Charan-Upasana: చిన్నపిల్లాడిగా మారిన చెర్రి.. లోకాన్ని మరిచి చిలిపి పనులతో అల్లరి చేసిన మెగా కపూల్..
Viral Photo: కురుల మాటున మోము దాచిన అందాల సీతాకోకచిలక.. స్టార్ హీరో తనయ.. ఎవరో గుర్తుపట్టండి..
Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..