మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలను చేకూరుస్తాయి. పెసర్లు, నల్ల శనగలు, చిక్కుళ్లు వంటి ధాన్యాలను రాత్రంతా నానబెడితె మరునాడు ఉదయానికి మొలకలుగా మారతాయి. ఈ మొలకెత్తిన విత్తనాలను రోజూ తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియను మెరుగపరచడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవల్స్ మెరుగుపడి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ డీ, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఆరోగ్యానికి మేలు చేసే మొలకెత్తిన విత్తనాలు కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి హానీ చేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం కూడా ప్రమాదమే.
పచ్చి మొలకలలో హానికరమైన బ్యాక్టిరియా ఉంటుంది. దీనివలన ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. మొలకలు తిన్న 12-72 గంటల తర్వాత చాలా మందికి అతిసారం, పొత్తి కడుపు తిమ్మిర్లు, వాంతులు వంటి సమస్యలు కలుగుతాయి. అయితే ఈ సమస్యలు అందరిలో కాకుండా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధుల విషయంలో తరచుగా జరుగుతుంది. అయితే కొందరికి మొలకెత్తిన విత్తనాలు అస్సలు పడవు. అలాంటి వారు వీటిని నేరుగా కాకుండా.. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి కాసేపు వేయించాలి. 5-10 నిమిషాలపాటు.. ఉప్పునీటిలో ఉడకబెట్టి తీసుకోవచ్చు. ఇలా చేసిన విత్తనాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి.
వేడి చేసిన మొలకలతో పోలిస్తే పచ్చి మొలకలు జీర్ణం కావడం కష్టమంటున్నారు నిపుణులు. వీటితో వచ్చే పోషకాలను శరీరం తొందరగా గ్రహించదు. కడుపు సంబంధిత సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉడికించిన మొలకలను తీసుకోవడం ఉత్తమం. వేడి చేయడం వలన ఇందులోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహిస్తుంది.
Balakrishna: అఖండ మా విజయం కాదు..సినీ పరిశ్రమ విజయం.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్..