Kitchen Hacks: కోడిగుడ్లు ఎలా ఉడకబెడితే మనకు ప్రయోజనం.. ఈ విషయాలు మీకోసమే!

|

Sep 08, 2023 | 10:14 PM

కోడి గుడ్లు మనకు ఎంత బలమో.. శరీరానికి ఎంత ప్రయోజనమో అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోడి గుడ్లలో శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఎన్నో ఉన్నాయి. ఎదిగే పిల్లలకు రోజూ ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు ఇస్తే.. వాళ్లు బలంగా, దృఢంగా తయారవుతారు. చిన్నవారే కాదు.. ఏ వయసులోని వారైనా కూడా కోడి గుడ్లను రోజూ తీసుకోవచ్చు. ఇందులో ఉండే కాల్షియం ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త హీనత..

Kitchen Hacks: కోడిగుడ్లు ఎలా ఉడకబెడితే మనకు ప్రయోజనం.. ఈ విషయాలు మీకోసమే!
Eggs Benefits
Follow us on

కోడి గుడ్లు మనకు ఎంత బలమో.. శరీరానికి ఎంత ప్రయోజనమో అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోడి గుడ్లలో శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఎన్నో ఉన్నాయి. ఎదిగే పిల్లలకు రోజూ ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు ఇస్తే.. వాళ్లు బలంగా, దృఢంగా తయారవుతారు. చిన్నవారే కాదు.. ఏ వయసులోని వారైనా కూడా కోడి గుడ్లను రోజూ తీసుకోవచ్చు. ఇందులో ఉండే కాల్షియం ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త హీనత సమస్య ఉంటే తగ్గుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఒక్కటేంటి.. ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా కోడి గుడ్డు చెక్ పెడుతుంది.

సరిగ్గా ఉడికిస్తేనే పోషకాలు పూర్తిగా అందుతాయి:

అయితే కోడి గుడ్లను ఉడికించి తీసుకుంటేనే అందులోని పోషకాలు పూర్తిగా మనకు అందుతాయి. కోడి గుడ్లను కూడా సరైన పద్దతిలో ఉడకబెట్టాలి. కానీ చాలా మందికి కోడి గుడ్లను ఎలా ఉడక బెట్టాలో తెలీదు. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాని వల్ల కోడి గుడ్ల మీద ఉండే పొట్టు సరిగ్గా రాదు. దీంతో గుడ్లు ముక్కులు ముక్కలుగా ఉంటుంది. అలాగే కొన్ని సార్లు గుడ్లు గట్టిగా అయిపోతాయి. ఇలాంటి సమస్యలు ఎదురవ్వకుండా ఉండాలంటే కోడి గుడ్లను సరైన పద్దతిలో ఉడకబెట్టాలి. కొంత మంది కోడి గుడ్లను ఇలా వేసి.. అలా దించేస్తారు. మరికొంత మంది చాలా ఎక్కువ సమయం ఉడకబెడతారు. అసలు కోడి గుడ్లను ఎంత సేపు ఉడికించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఇలా ఉడకబెట్టాలి:

కోడి గుడ్లు ఉడకటానికి 10 లేదా 15 నిమిషాలు సరిగ్గా సరిపోతుంది. కోడి గుడ్డలోని పచ్చ సొన ఉండకటానికి 4 లేదా 5 నిమిషాలు చాలు. గుడ్డు పూర్తిగా ఉడకటానికి.. 10 లేదా 15 నిమిషాలు సరిపోతుంది. అలాగే గుడ్లు ఉడకబెట్టేటప్పుడు.. ఒకదాని మీద అస్సలు వేయకూడదు. అలాగే గుడ్లు మునిగే వరకూ నీళ్లు పోయాలి. ఉప్పు వేసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికిన గుడ్లలోని నీటిని పారబోసి.. మళ్లీ చల్లని నీరు కానీ.. ఐస్ క్యూబ్స్ వేసి.. ఓ ఐదు నుంచి 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా చేస్తే కోడి గుడ్లపై ఉండే పొట్టు ఈజీగా రావడంతో పాటు.. ఇవి పూర్తిగా హెల్దీగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి