Kidney health tips: ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి పెద్ద కారణం మనం పాటించే కొన్ని అలవాట్లలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మనలోని కొన్ని అలవాట్లు కిడ్నీల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైన అలవాటు.. ఎక్కువగా పొగతాగడం. ధూమపానం శరీరంలోని రక్త నాళాలపై ప్రభావం చూపుతుంది. ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఫలితంగా మూత్రపిండాలపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. అతిగా ధూమపానం చేసేవారి పరిస్థితి కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే ఈ కింద సూచించిన అలవాట్లను మానుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ధూమపానం మానేయాలి: కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానం మానేయండి. స్మోకింగ్ వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. కొన్నిసార్లు ఈ అలవాటు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. వాస్తవానికి ధూమపానం శరీరంలోని రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల రక్తప్రసరణ మందగించి కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.
అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి: కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. అనారోగ్యకరమైన ఆహారం బరువు పెరగడానికి దారితీస్తుంది. దీంతో శరీరంలో అనేక వ్యాధులు పెరగడం ప్రారంభమవుతాయి. కిడ్నీపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. సోడియం, ప్రాసెస్ చేసిన మాంసాలు, మూత్రపిండాలకు హాని కలిగించే ఆహారాలకు దూరంగా ఉండండి..
సోమరితనం విడిచిపెట్టండి: కొంతమంది తమ ఫిట్‌నెస్ కోసం రోజు మొత్తంలో అరగంట కూడా కేటాయించలేరు. కొన్నిసార్లు దీనికి కారణం సోమరితనం. మీకు కూడా బద్ధకం అలవాటు ఉంటే వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. ఇది మీ మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకుంటే కిడ్నీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
తక్కువగా నీరు తాగడం: కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే నీరు బాగా తాగడం చాలా ముఖ్యం. కొంతమంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు. కానీ శరీరంలో నీరు లేకపోవడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 8-10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..