KBC Contestant: ఓ చెట్టు రబ్బరు నుంచి తయారు చేసే మసాలా.. భారతీయ వంటల్లో వినియోగం.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

|

Nov 28, 2021 | 8:17 PM

KBC Contestant: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్  హోస్ట్ గా చేస్తున్న కౌన్ బనేగా కరోర్ పతి గత 13ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పటికీ ఆసక్తికరమైన ప్రశ్నలతో..

KBC Contestant: ఓ చెట్టు రబ్బరు నుంచి తయారు చేసే మసాలా.. భారతీయ వంటల్లో వినియోగం.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
Kaun Banega Crorepati
Follow us on

KBC Contestant: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్  హోస్ట్ గా చేస్తున్న కౌన్ బనేగా కరోర్ పతి గత 13ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పటికీ ఆసక్తికరమైన ప్రశ్నలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవల జరిగిన ఓ  ఎపిసోడ్‌లో యువ కంటెస్టెంట్ నైవేద్య అగర్వాల్‌ పాల్గొన్నది. ఈ రియాలిటీ షోలో నైవేద్య రూ. 12.5 లక్షలు సంపాదించింది. 12 ప్రశ్నలకు విజయవంతంగా సమాధానమిచ్చిన నైవేద్య అగర్వాల్ రూ. 25 లక్షలు గెలుచుకునే ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో విఫలమై షో నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.

నైవేధ్యని అయోమయానికి గురిచేసిన ప్రశ్న ఏమిటంటే: భారతీయ వంటల్లో ఉపయోగించే ఒక మసాలా..  ఒక మొక్క యొక్క గమ్ నుండి తయారు చేస్తారు. ముఖ్యంగా ఈ మొక్కలు ఆఫ్ఘనిస్తాన్ ,  ఇరాన్‌లలో పెరుగుతాయి అని అమితాబ్ అడిగారు. అంతేకాదు ఈ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్లుగా కుంకుమపువ్వు, ఇంగువ, దాల్చినచెక్క ,  జాపత్రి.  అయితే ప్రశ్నకు సమాధానం చెప్పలేక నైవేద్య వెనుదిరిగింది. అయితే దీనికి సమాధానం తెలుసా? అది ఇంగువ.

ఈ మొక్కలు ఆఫ్ఘనిస్తాన్ , ఇరాన్‌లలో పెరుగుతాయి. భారతీయ వంటశాలలలో సాధారణంగా ఉపయోగించే ఓ పదార్ధం. దీనిని ఇంగువ, హింగ్ అని పిలుస్తారు. ఇది ఆహారపదార్ధాలు అదనపు రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ప్రధానంగా మీ జీర్ణ సమస్యలకు సహాయపడుతుంది” అని పోషకాహార నిపుణులు చెప్పారు. ఈరోజు ఇంగువ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

* కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం లేదా కడుపులో ఏదైనా అసౌకర్యం వంటి జీర్ణ సమస్యలకు ఇంగువ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
* ఇది వికారం నయం చేయడంలో సహాయపడుతుంది.
*ఇంగువ పప్పులను సులభంగా జీర్ణం చేస్తుంది. అందువల్ల, ఇది సాధారణంగా పోపు సామగ్రితోపాటు ఉపయోగిస్తారు.
* శిశువులలో కడుపు సమస్యలను నయం చేయడానికి ఇంగువను ఉపయోగిస్తారు. నూనెలో కొద్దిగా మసాలా మిక్స్ చేసి పొట్టపై మర్దన చేయాలి.
* ఇంగువ అన్ని వయసుల వారికి మంచిది.
*దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ , యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉన్నాయి.

అయితే ఇంగువను ఎక్కువగా ఆహారంలో వేస్తే .. ఆహారం చేదుగా మారుతుంది. కనుక రుచి కోసం ఆరోగ్య ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇంగువ కేవలం చిటికెడు మాత్రమే ఆహార పదార్ధాలకు జోడించాలని  పోషకాహార నిపుణుడు చెప్పారు .

Also Read:  శ్రీవారి ఆభరణాల విశిష్టత తెలిసేలా శ్రీవారి మ్యూజియాన్ని తీర్చిదిద్దనున్న టీటీడీ.. వచ్చే బ్రహ్మోత్సవాలనాటికి అందుబాటులోకి