Sleeping Tips – Health: జీవితంలో నిద్ర భాగం.. మనిషి నిద్రించకపోతే.. రోగాలు కొనితెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు పేర్కొంటుంటారు. చివరికి కునుకు పడితేనే మనసు కాస్త కుదుటపడుతుందని మన పెద్దవాళ్లు కూడా పేర్కొంటుంటారు. మంచిగా నిద్రపోతేనే చలాకీగా ఉంటామని.. మనిషికి తగినంత నిద్ర అవసరమని నిపుణులు కూడా అభిప్రాయడతున్నారు. సరైన నిద్రలేకపోతే విపరీత స్థాయిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరకు డిప్రెషన్‌కు దారి తీస్తుందని.. ఇది అతి ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే.. నిద్రమత్తు మనిషి బలహీనపరిస్తే.. నిద్రలేమి మనిషి ఉనికికే సవాలుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
అయితే.. నిద్రలేమి సమస్య రెండు రకాలుగా ఉంటుంది. తాత్కాలిక నిద్రలేమి, రెండోది దీర్ఘకాలిక నిద్రలేమి. తాత్కాలిక నిద్రలేమి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. పలు కారణాలు, ఆలోచనల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అయితే దీర్ఘకాలిక నిద్రలేమి చాలకాలంపాటు ఉంటుంది. దీనివల్ల మనిషి చికాకుపడుతూ.. డిప్రెషన్‌లోకి వెళతాడని వైద్య పరిశోధనల్లో తేలింది. దీనికి ముందస్తుగానే కొన్ని చిట్కాలు పాటించడమో లేకపోతే వైద్యులను సంప్రదించడమో మేలని పేర్కొంటున్నారు.
ప్రశాంతంగా నిద్రపోవడానికి చిట్కాలు..
మానసిక ఒత్తిడి నివారణకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి నిత్యం చేయాలి. దీంతోపాటు ఒక గంటపాటు వాకింగ్ చేస్తే.. మానసిక ప్రశాంతత కలిగి నిద్రలేమి తీవ్రత తగ్గుతుంది.
పడుకోవడానికి రెండు గంటల ముందుగా మంచి ఆహారం తీసుకోవాలి.
ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్స్, మసాలా పదార్థాలు తినకుండా పౌష్టికాహారం మాత్రమే తినాలి.
ఆకు కూరలకు, వెజిటేబుల్స్, తాజా పండ్లు తీసుకోవాలి.
సమయానికి ఆహారం తీసుకుంటూ నిద్రపోవాలి.
ఎక్కువగా కుటుంబసభ్యులతో.. స్నేహితులతో మాట్లాడుతుండాలి.
ఎవరితో అయితే మనం చనువుగా ఉంటామో వారితో మాట్లాడాలి.
అంతర్మథనాలకు దూరంగా ఉండాలి. భావోద్వేగాలకు లోనుకాకుండా.. ఆలోచించకుండా ఉండాలి.
ఎక్కువగా ప్రశాంత వాతావరణంలో గడిపేందుకు ప్రణాళిక చేసుకోవాలి.
Also Read: