Child: మీ పిల్లలు మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లోనే ఈ పద్దతులు పాటించండి..?

|

Feb 14, 2022 | 8:59 AM

Child: ఈ రోజుల్లో పిల్లలు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేగాక ఫ్రాసెస్‌ ఫుడ్స్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనివల్ల కడుపునొప్ప,

Child: మీ పిల్లలు మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఇంట్లోనే ఈ పద్దతులు పాటించండి..?
Children
Follow us on

Child: ఈ రోజుల్లో పిల్లలు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేగాక ఫ్రాసెస్‌ ఫుడ్స్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనివల్ల కడుపునొప్ప, మలబద్దకంతో ఇబ్బందిపడుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలని గమనిస్తూ ఉండాలి. అయితే మలబద్ధకం సమస్యను అధిగమించడం చాలా సులభం. మొదటగా అనారోగ్యకరమైన ఆహారం అవైడ్‌ చేయాలి. సరైన దినచర్యను పాటించాలి. ఇంట్లో దొరికే కొన్ని ఆహారాలను తింటే సమస్య పరిష్కారమవుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

1. బొప్పాయి

బొప్పాయి కడుపుకు దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఇందులో ఉండే పీచు పొట్టని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ బిడ్డ 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉంటే అతనికి బొప్పాయి తినిపించవచ్చు. ఉదయాన్నే బొప్పాయి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

2. వేడి నీరు తాగాలి

పిల్లలకి ప్రతిరోజు ఉదయం వేడినీరు తాగిస్తే కడుపు క్లీన్‌ అవడమే కాకుండా చర్మానికి కూడా మంచిది. మలబద్ధకం సమస్యను తొలగించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ రెమెడీగా పనిచేస్తుంది. అయితే నీరు గోరు వెచ్చగా ఉండాలి. అధిక వేడిగా ఉండకూడదు.

3. ప్రతి రోజు యాఆపిల్

యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. ఆయుర్వేద వైద్యులు ప్రతి రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక యాపిల్ తినాలని సూచిస్తారు. యాపిల్‌లో శరీరానికి ఎంతో మేలు చేసే ఫైబర్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజూ ఒక యాపిల్ తింటే ఎన్నో రోగాల బారి నుంచి బయటపడతారు.

4. సరైన మోతాదులో నీరు

చాలా మంది పిల్లలు తక్కువ నీరు తాగుతారు దీని కారణంగా మలబద్ధకం సమస్య ఇబ్బంది పెడుతుంది. మీ బిడ్డకు 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉంటే అతనికి పుష్కలంగా నీరు తాగించండి. సరైన మోతాదులో నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

Mangoes: ఆ మామిడి వాసన, రుచి, అద్భుతం.. ధర కూడా అంతే రేంజ్‌లో..?

Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. వాలంటైన్స్‌ డే సందర్భంగా మరో అప్‌డేట్‌..?

Sun Worship: సూర్యుడి అనుగ్రహం కోసం ఆదివారం ఉపవాసం బెస్ట్‌.. అన్ని పనులు సకాలంలో పూర్తి..?