Hair Growth Foods: ఒత్తైన జుట్టు కావాలంటే ఈ ఆహార పదార్థాలు తినాల్సిందే!

జుట్టు అందంగా, పొడుగ్గా, ఒత్తుగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఏ వయసు వారికైనా అందంగా కనిపించాలనే తాపత్రయం ఉంటుంది. ఆ అందాన్ని మరింత రెట్టింపు చేసేది.. జుట్టే. రక రకాల హెయిర్ స్టైల్స్‌తో అందంగా కనిపించవచ్చు. వాలు జడ అంటే ఇష్టం ఉండనివారెవరూ ఉండరు. కానీ పెరుగుతున్న వాతావరణం కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన, భయం, డిప్రెషన్, ఆహార అలవాట్ల కారణంగా జుట్టు సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కారణాల వల్ల జుట్టు..

Hair Growth Foods: ఒత్తైన జుట్టు కావాలంటే ఈ ఆహార పదార్థాలు తినాల్సిందే!
Hair Growth

Edited By:

Updated on: Jan 15, 2024 | 6:00 PM

జుట్టు అందంగా, పొడుగ్గా, ఒత్తుగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఏ వయసు వారికైనా అందంగా కనిపించాలనే తాపత్రయం ఉంటుంది. ఆ అందాన్ని మరింత రెట్టింపు చేసేది.. జుట్టే. రక రకాల హెయిర్ స్టైల్స్‌తో అందంగా కనిపించవచ్చు. వాలు జడ అంటే ఇష్టం ఉండనివారెవరూ ఉండరు. కానీ పెరుగుతున్న వాతావరణం కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన, భయం, డిప్రెషన్, ఆహార అలవాట్ల కారణంగా జుట్టు సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కారణాల వల్ల జుట్టు రాలిపోవడం, చుండ్రు, పొడిబారి పోవడం, నిర్జీవంగా మారడం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మనం తీసుకున్న ఆహారంపైనే శరీర ఆరోగ్యం అనేది ఆధార పడి ఉంటుంది. మీ డైట్‌లో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చుకుంటే.. జుట్టు పెరుగుదల అనేది వేగంగా ఉంటుంది. అలాగే కేశాలు కూడా బలంగా, ఒత్తుగా పెరుగుతాయి. మరి మీ హెయిర్ గ్రోత్‌కి సహాయ పడే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మజ్జిగ లేదా పెరుగు:

పెరుగులో యాంటీ బయోటిక్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. పెరుగు తిన్నా లేదా మజ్జిగ రూపంలో తీసుకున్నా కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి తగ్గుతాయి. జుట్టు ఆరోగ్యానికి కూడా మజ్జిగ చాలా మంచింది. వీటిల్లో ఉండే క్యాల్షియం కంటెంట్.. జుట్టు కుదుళ్లకు రక్షణగా నిలుస్తుంది. జుట్టు రాలడానికి తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్ సమస్యతో, పొడి బారే ప్రాబ్లమ్‌ ఉన్నవారు ప్రతి రోజూ మజ్జిగ తాగడం చాలా మంచిది.

బాదం:

బాదంలో విటమిన్ ఇ, బయోటిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. అలాగే జుట్టు పెరుగుదలకు బాదం చక్కగా సహాయ పడుతుంది. జుట్టు రాలడం తగ్గి.. ఒత్తుగా పెరగాలంటే.. ప్రతి రోజూ నానబెట్టిన బాదం తీసుకోవడం మేలు. బాదంలోని పోషకాలు జుట్టు కుదళ్లను బలంగా ఉంచుతాయి. అంతే కాకుండా హెయిర్ సిల్కీగా, కాంతి వంతంగా మెరిసేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

గుడ్లు:

కోడి గుడ్లలో ప్రోటీన్, ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టు పెరుగుదలను అడ్డుపడే కారకాలను నిరోధిస్తాయి. ప్రతి రోజూ గుడ్డు తింటే.. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

కరివేపాకు:

కరివేపాకులో తిన్నా.. జుట్టు సమస్యలు తగ్గుతాయి. కరివేపాకులో విటమిన్లు బి, సి, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సెల్యూలార్ పునరుత్పత్తికి హెల్ప్ చేస్తాయి. అలాగే స్కాల్ఫ్‌పై రక్త ప్రసరణ జరుగుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి.. బలంగా, ఒత్తుగా చేస్తాయి. బాల మెరుపు రాకుండా ఉంటుంది. జుట్టు నెరిసే ప్రక్రియ కూడా నెమ్మదిగా జరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.