AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatherhood: తెలివైన బిడ్డకు తండ్రి కావాలనుకుంటున్నారా.. ఇందుకు అది కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి..

మహిళలకు తల్లి కావాలనే కోరిక ఎలాగైతే ఉంటుందో పురుషులకు తండ్రికావాలనే కోరిక కూడా అలాగే ఉంటుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తల్లి ఆరోగ్యం ఎంత ప్రభావం చూపుతుందో తండ్రి ఆరోగ్యం కూడా అంతే ప్రభావం చూపుతుంది. అందుకే ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే పిల్లలను ప్లాన్‌ చేసుకోవాలని...

Fatherhood: తెలివైన బిడ్డకు తండ్రి కావాలనుకుంటున్నారా.. ఇందుకు అది కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి..
Fatherhood
Narender Vaitla
|

Updated on: Nov 04, 2022 | 10:56 AM

Share

మహిళలకు తల్లి కావాలనే కోరిక ఎలాగైతే ఉంటుందో పురుషులకు తండ్రికావాలనే కోరిక కూడా అలాగే ఉంటుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తల్లి ఆరోగ్యం ఎంత ప్రభావం చూపుతుందో తండ్రి ఆరోగ్యం కూడా అంతే ప్రభావం చూపుతుంది. అందుకే ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే పిల్లలను ప్లాన్‌ చేసుకోవాలని సూచిస్తుంటారు నిపుణులు. అయితే మారుతోన్న జీవన విధానం, వృత్తి జీవితం కారణంగా వివాహాలు ఆలస్యమవుతున్నాయి. అలాగే ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల వ్యసనాల కారణంగా పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గుతోంది. వయసు పెరుగుతున్నా కొద్దీ పురుషుల్లో ఈ సమస్య పెరుగుతోంది.

ఇంతకీ ఏ వయసులో పిల్లన్ని ప్లాన్‌ చేసుకుంటే పుట్టబొయే బిడ్డ ఆరోగ్యంగా, తెలివిగా ఉంటారు లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా పురుషుల్లో సంతానలేమి సమస్యకు స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడం, స్పెర్మ్‌ నాణ్యత తగ్గడం, శుక్రకణాల్లో చలనం తగ్గడం లాంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. స్మోకింగ్‌, డ్రింకింగ్‌, ఒత్తిడి వంటికి వీటికి కారకాలుగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఆలస్యంగా పిల్లల్ని ప్లాన్‌ చేసుకోవడం కూడా దీనికి ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు.

* సాధారణంగా పురుషులు 25 వయసులో ఉన్నప్పుడు స్పెర్మ్‌ కౌంట్‌, కదలికలు బాగా ఉంటాయి. ఈ సమయంలో పిల్ల్ని ప్లాన్‌ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్‌ను చెప్పొచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ వయసులో యువత పెళ్లిలకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి ప్రస్తుత రోజుల్లో 25 ఏళ్లలో పిల్లల్ని ప్లాన్‌ చేసుకోవాలనుకోవడం అసాధ్యం.

ఇవి కూడా చదవండి

* పురుషులు పిల్లల్ని ప్లాన్‌ చేసుకునేందుకు 25 నుంచి 30 ఏళ్లు బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు. వైద్యుల అభిప్రాయం ప్రకారం 25 ఏళ్ల తర్వాత నుంచి స్పెర్మ్‌ కౌంట్‌ సంఖ్య క్రమంగా తగ్గుతుంటుంది.

* ఇక 30 నుంచి 35 ఏళ్ల మధ్య పిల్లల్ని ప్లాన్‌ చేసుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులో శుక్రకణాలు సంఖ్య ఎక్కువగా ఉన్నా చలనం మాత్రం తక్కువగా ఉంటుంది. ఇది సంతాన లేమి సమస్యకు కారణంగా మారుతుండొచ్చు.

* ఇక 35 ఏళ్ల తర్వాత పిల్లల్ని ప్లాన్‌ చేసుకుంటే మరిన్ని సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ ఏజ్‌లో రిలీజ్‌ అయ్యే శుక్రకణాలు అండంతో ఫలదీకరణం చెందడంలో సమస్యలు ఎదురవుతాయి.

* 40 ఏళ్ల తర్వాత అటు స్పెర్మ్‌ కౌంట్‌తో పాటు నాణ్యత కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ వయసులో పిల్లల్ని ప్లాన్‌ చేస్తే పుట్టబొయే పిల్లలోనూ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వయసు పెరగడం కారణంగా స్పెర్మ్‌ డీఎన్‌ఏ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ప్రాథమిక సమాచారం ఆధారంగా మాత్రమే అందించడం జరిగింది. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలు తీసుకోవడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..