Lemon Juice: పరగడుపున 3 విధాలుగా నిమ్మరసం తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు..!

|

May 28, 2022 | 12:41 PM

Lemon Juice: ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. బరువు తగ్గడానికి వ్యాయామం,

Lemon Juice: పరగడుపున 3 విధాలుగా నిమ్మరసం తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు..!
Lemon Juice
Follow us on

Lemon Juice: ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. బరువు తగ్గడానికి వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ ఆహారంలో కొన్ని పానీయాలను చేర్చుకుంటే వేగంగా బరువు తగ్గుతారు. నిమ్మకాయతో తయారు చేసిన జ్యూస్‌లు బరువు సులభంగా తగ్గిస్తాయి. ఎందుకంటే ఇందులో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, పెక్టిన్, ఫైబర్ ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. అవి ఫ్రీ రాడికల్స్ సమస్యల నుంచి రక్షించడంలో పనిచేస్తాయి.

1. నిమ్మ, తేనె జ్యూస్‌

నిమ్మ, తేనె కలిపి తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. చాలామంది తమ ఆహారంలో నిమ్మకాయను చేర్చుకుంటారు. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలపండి. దానికి ఒక చెంచా తేనె కలపండి. ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

2. నిమ్మ, అల్లం నీరు

అల్లంతో ఆరోగ్యకరమైన పానీయం తయారు చేయవచ్చు. దీని కోసం ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, అల్లం రసం కలపండి. దానికి నల్ల ఉప్పు జోడించండి. ఉదయం ఖాళీ కడుపుతో తాగండి. ఈ పానీయం మీ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి పని చేస్తుంది. మీరు ఈ నీటిని రోజుకు 2 నుంచి 3 సార్లు తాగవచ్చు. ఈ డ్రింక్ తాగిన తర్వాత చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. తరువాత అనారోగ్యకరమైన ఆహారం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

3. నిమ్మ, పుదీనా నీరు

వేసవిలో పుదీనా తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఆహారంలో నిమ్మ, పుదీనా నీటిని చేర్చుకోవచ్చు. దీని కోసం, ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలపండి. అందులో పుదీనా ఆకుల రసాన్ని కలపండి. దానికి కొంచెం నల్ల ఉప్పు జోడించండి. ఉదయం ఖాళీ కడుపుతో తాగండి. ఈ రెండు ఆహారాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. దీని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. దీని వల్ల మీకు త్వరగా ఆకలి అనిపించదు. మీరు రోజంతా ఈ నీటిని తాగవచ్చు. ఇది త్వరగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి