Okra Health Benefits : బెండకాయను మీ డైట్‎లో చేర్చుకుంటే డయాబెటిస్, కొలెస్ట్రాల్‎కు చెక్ పెట్టొచ్చు..!!

| Edited By: Anil kumar poka

Feb 13, 2023 | 6:42 PM

బెండకాయ కూరను చాలామంది ఇష్టంగా తింటారు. బెండకాయతో రకరకాల వంటలు చేస్తుంటారు. కూర కంటే బెండకాయ ఫ్రైని తినేందుకు ఆసక్తి చూపిస్తారు.

Okra Health Benefits : బెండకాయను మీ డైట్‎లో చేర్చుకుంటే డయాబెటిస్, కొలెస్ట్రాల్‎కు చెక్ పెట్టొచ్చు..!!
Okra
Follow us on

బెండకాయ కూరను చాలామంది ఇష్టంగా తింటారు. బెండకాయతో రకరకాల వంటలు చేస్తుంటారు. కూర కంటే బెండకాయ ఫ్రైని తినేందుకు ఆసక్తి చూపిస్తారు. బెండకాయలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. డయాబెటిస్, కొలెస్ట్రాల్ రోగులకు బెండకాయ ఒక సూపర్ ఫుడ్. ఇందులో ఉండే విటమిన్ బి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియంతోపాటు తక్కువ కేలరీలు, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటాయి. బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు,అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారికి బెండకాయ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

ప్రస్తుతం వేసవికాలం సమీపిస్తోంది. ఈసీజన్ లో శరీరానికి కావాల్సిన నీటితోపాటు పోషకాలను కూడా అందించాలి. వేసవికాలంలో అధికంగా కనిపించే బెండకాయలో ఎన్నోప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలోని చక్కర స్థాయిలను కంట్రోల్లో ఉంచేందుకు బెండకాయ ఎంతో ఉపయోగపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఆకలిని తగ్గిస్తుంది. అధిక క్యాలరీలను తగ్గించడంతోపాటు జీర్ణక్రియలో సహాయపడుతుంది. 2011లో జర్నల్ ఆఫ్ ఫార్మసీ అండ్ బయో అలైడ్ సైన్సెస్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, డయాబెటిక్ ఎలుకలు..నేలపై ఉన్న బెండకాయ గింజలు తినడం వల్ల వాటి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గాయని పరిశోధకులు కనుగొన్నారు. సుమారు పది రోజుల పాటు బెండకాయ విత్తనాలు వాటికి ఆహారంగా అందించి పరిశోధనలు జరిపారు.

రక్తంలో చక్కెరను ఎలా నియంత్రిస్తుంది:

బెండకాయలో అధిక మొత్తంలో నీటిలో కరిగే, కరగని ఫైబర్‌లు ఉంటాయి. అందుకే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. బెండకాయలో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, లినోలెయిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్, ఫోలేట్ వంటి ఇతర పోషకాలు ఫుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. కాబట్టి బ్లడ్ షుగర్ ఎప్పుడూ కూడా పెరకుండా, తగ్గకుండా స్థిరంగా ఉంటుంది. ఒక కప్పు బెండకాయ కూరలో దాదాపు 37మైక్రోగ్రాముల ఫొలేట్ ఉంటుంది.

అధిక కొలెస్ట్రాల్‎ను నియంత్రిస్తుంది:

మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం తినే ఆహారం యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండేలా తినాలి. తద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బెండకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో ఉండే పెక్టిన్ అనే ఎంజైమ్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతోపాటు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కణాలకు ఆక్సీకరణ నష్టాన్ని నివరిస్తుంది కాబట్టి క్యాన్సర్ ప్రమాదం తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం