యోగా అనేది చాలా పురాతనమైనది. యోగాకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనితో అనేక అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు. యోగాతో మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కరెక్ట్ గా, క్రమం తప్పకుండా వేస్తే బలంగా తయారవుతారు. శరీరంలో ఇమ్యూనిటీని పెంచే శక్తి కూడా యోగాకు ఉంది. ఒక్కటేంటి గుండె సమస్యలు, డయాబెటీస్, మానసిక ఒత్తిడి వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. చాలా మంది ఆడవారు, మగవారు పలు లైంగిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ ని ఎవరికీ చెప్పడానికి ఇష్టపడరు. డాక్టర్ వద్దకు వెళ్లినా చెప్పడానికి కూడా మొహమాట పడతారు. అలాంటి వారికి ఈ యోగా ఆసనాలు బాగా ఉపయోగ పడతాయి. ముఖ్యంగా మగవారిలో ఉండే లైంగిక ప్రాబ్లమ్స్ ను ఇవి తగ్గిస్తాయి. మరి అవేంటి? ఎలా వేయాలో తెలుసుకుందాం.
సేతు బంధ సర్వాంగాసనం:
సేతు బంధ సర్వాంగ ఆసనాన్ని క్రమం తప్పకుండా వేస్తే రక్త ప్రసరణని పెంచుతుంది. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గుతాయి. ఈ ఆసనాన్ని వేయడం వల్ల ఆ టైంలో బాగా ఎంజాయ్ చేయవచ్చట.
పద్మాసనం:
రోజూ కాసేపు ఈ ఆసనం ఇవ్వడం వల్ల మనసు రిలాక్స్ అవ్వడమే కాకుండా అలసట దూరం అవుతుంది. ఈ ఆసనం లైంగిక కోరికలను పెంచుతుంది. బ్లడ్ సర్క్యూలేషన్ కూడా పెరుగుతుంది. అంతే కాకుండా శ్వాస క్రియను మెరుగు పరిచేందుకు హెల్ప్ చేస్తుంది. ఇది మగ వారిలో పెల్విక్ ఫ్లోర్ ని స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే ఈ ఆసనాన్ని డైలీ కంటిన్యూ చేస్తూ ఉంటే.. పొట్టలోని కొవ్వు కూడా తగ్గుతుంది.
పరిపూర్ణ నవాసనం:
ఈ పరిపూర్ణ నవాసనాన్ని తరచూ క్రమం తప్పకుండా వేస్తే ఆ సమయంలో వచ్చే సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు. ఈ ఆసనం బాడీకి ఫ్లెక్సిబిలిటీని పెంచడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
అంతే కాకుండా రోజూ క్రమం తప్పకుండా యోగాలో సింపుల్ ఆసనాలు వేసినా కూడా లైంగిక సమయంలో వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చుకోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.