Hyderabad Pharma city: మీకు తెలుసా.! నిజాం కాలం నుంచే హైదరాబాద్ ఒక ఫార్మా హబ్

హైదరాబాద్ మహానగరం చారిత్రక కట్టడాలకు మాత్రమేకాదు, మెడికల్ హబ్‌గా కూడా పూర్వం నుంచీ మంచి గుర్తింపు కలిగి ఉంది. దాదాపు ఐదు శతాబ్ధాల క్రితం భాగ్యనగరంలో నిర్మించిన..

Hyderabad Pharma city:  మీకు తెలుసా.!  నిజాం కాలం నుంచే హైదరాబాద్ ఒక ఫార్మా హబ్

Edited By: Team Veegam

Updated on: Mar 04, 2021 | 2:42 PM

Hyderabad : Pharma hub since Nizam’s era :హైదరాబాద్ మహానగరం చారిత్రక కట్టడాలకు మాత్రమేకాదు, మెడికల్ హబ్‌గా కూడా పూర్వం నుంచీ మంచి గుర్తింపు కలిగి ఉంది. దాదాపు ఐదు శతాబ్ధాల క్రితం భాగ్యనగరంలో నిర్మించిన అత్యద్భుత కట్టడాలు .. కేవలం స్మారక భవనాలే కాదు, వీటిలో కొన్ని భవనాలు ప్రజా సేవలకు ఉద్దేశించినవి. ఈ రోజు, కరోనా వ్యాక్సిన్లను తయారుచేసినందుకు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అయితే, ఆ క్రెడిట్ హైదరాబాద్ అమ్ముల పొదిలోకి వెళ్తుండటం మనందరికీ సంతోషదాయకం. ఇప్పుడే కాదు, గత 150 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో వివిధ మహమ్మారి రోగాలకి టీకాలు తయారు చేస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన వెంటనే దారుల్ – షిఫా యునాని ఆసుపత్రి స్థాపించబడింది. ఈ రెండు అంతస్థుల భవనం ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది.

ఇక, సర్ రోనాల్డ్ రాస్ మలేరియా మహమ్మారికి విరుగుడు కనుకునేందుకు తన ప్రయోగాలను హైదరాబాద్‌లో నిర్వహించారన్న విషయం యంగ్ జనరేషన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1897 ఆగస్టు 20 న మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని.. ఆ మహమ్మారిని ప్రాలదోలేందుకు సర్ రోనాల్డ్ రాస్ టీకాలకు పునాది వేసింది కూడా ఇక్కడే కావడం విశేషం. ఈ కృషికి గాను ఆయన1902 లో నోబెల్ బహుమతిని సైతం అందుకున్నారు. నిజాం స్టేట్ ఆఫ్ హైదరాబాద్‌లో భాగంగా ఉండిన ఈ భాగ్యనగరాన్ని ఉప ఖండంలోనే ఒక మెడికల్ హబ్‌గా పిలుస్తారు. గత శతాబ్దంలో ప్లేగు, కలరా వంటి ఘోరమైన మహమ్మారులు ప్రజలపై పడగ విప్పాయి.

1911 లో కలరా వ్యాధి కారణంగా 5 వేలకు పైగా ప్రజలు మరణించారు. అదే సంవత్సరంలో, ప్లేగు కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో సాలార్ జంగ్ మొదటి మీర్ తురాబ్ అలీ ఖాన్ ప్రజారోగ్యం కోసం వైద్య విభాగాన్ని ఏర్పాటు చేశారు. నారాయణగూడలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపిఎం) ను ఏర్పాటు చేశారు.1886 లో ఆరవ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ పాలనలో, ఐపిఎం భవనంలో ఆరోగ్య శాఖ స్థాపించబడింది. ఐపిఎం భవనం పరిశోధనా కేంద్రంగా ఖ్యాతిని పొందింది. వ్యాక్సిన్ల ద్వారా ప్లేగును నియంత్రించే చర్యలు ఈ భవనం నుండి 1870 లో ప్రారంభించబడ్డాయి అదే భవనంలోనే 1904 లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్.. ఆహారం, నీటి స్వచ్ఛత కోసం పరీక్షలు నిర్వహించింది. ఈ భవనం యొక్క సమ్మేళనం నుండి స్మాల్ పాక్స్ టీకాలకు సన్నాహాలు జరిగాయి.

ప్లేగు మరియు ఇతర మహమ్మారి వ్యాక్సిన్లపై పరిశోధన కోసం ఐపిఎం భవనాన్ని ఒక కేంద్రంగా ఉపయోగించారు. నిజాం హెల్త్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఎగ్జామినర్ ఆఫీసర్‌ను నారాయణగూడలోని ఈ భవనానికి తరలించారు, అప్పటి నుండి పాండమిక్స్‌పై పరిశోధన ప్రక్రియ వేగవంతమైంది. 1941 లో టైఫాయిడ్ కోసం వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది కూడా భాగ్యనగరంలోనే కావడం విశేషం. ఈ విభాగాన్ని “నిజాం వ్యాక్సిన్ విభాగం” అని పిలుస్తారు, దీనిని 1949 లో “సెంట్రల్ లాబొరేటరీస్” గా మార్చారు. డాక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ యొక్క మొదటి అధిపతి డాక్టర్ వై ఎస్ నరేన్ రావు తరువాత దీనిని టిటి ఇంజెక్షన్ కేంద్రంగా మార్చారు. ఇంతకంటే ఏంకావాలి.. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఫార్మా హబ్ అని చెప్పేందుకు.?

Read also : CPI Narayana challenges YSRCP : దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. వైసీపీకి సీపీఐ నారాయణ సవాల్‌

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

పాల వ్యాపారంతో అదరగొడుతున్న 23 ఏళ్ల కుర్రాడు.. అవి అలాంటి ఇలాంటి పాలు కావు మరీ..! ఏంటో తెలుసా..