Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతిగా ఆలోచించే అలవాటు మీకు ఉందా..? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా..?

కొంతమంది ప్రతీ చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు ఆందోళనలతో బాధపడుతూ ఉంటారు. ఈ విధమైన ఆలోచనలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. అయితే కొన్ని సరళమైన మార్గాలు పాటిస్తే ఈ అనవసర ఆలోచనల్ని దూరం చేయవచ్చు. ఆ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అతిగా ఆలోచించే అలవాటు మీకు ఉందా..? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా..?
Stress Management Tips
Follow us
Prashanthi V

|

Updated on: Apr 05, 2025 | 4:18 PM

కొంతమంది చిన్న విషయాన్ని పెద్దగా తీసుకుని అనవసర ఆలోచనలతో సతమతమవుతుంటారు. ఇలాంటి అలవాటు వల్ల ఎప్పటికప్పుడు చింతలు, భయాలు వదలిపెట్టవు. అయితే ఈ అనవసర ఆలోచనల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని సరళమైన మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ఏదైనా పని మనసుకి నచ్చితే దానిలో నిమగ్నం కావడం వల్ల అనవసర ఆలోచనలు దూరమవుతాయి. మనకు ఇష్టం ఉన్న హాబీ, సృజనాత్మక కార్యక్రమాలు, చేతిపనులు మొదలైనవి దృష్టిని ఆకర్షిస్తాయి. ఇలా చేయడం వల్ల ఆందోళనలు తగ్గుతాయి.

మనలో కలుగుతున్న ఆందోళనలు, భయాలు మౌనంగా భరించకుండా మనసుకు నమ్మకం ఉన్నవారితో పంచుకోవాలి. ఒకసారి మన భావాలను బయట పెట్టడం వల్ల ఆలోచనల ఒత్తిడి కొంత మేర తక్కువవుతుంది. ఇలాంటి సంభాషనలు మనశ్శాంతికి దోహదపడతాయి.

ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానంలో నిమగ్నమవ్వడం వల్ల మనస్సుకు శాంతి కలుగుతుంది. భావోద్వేగాలపై కంట్రోల్ పెరిగి మన ఆలోచనలు నిశ్చితంగా ఉండేలా మారుతాయి. ధ్యానం వల్ల జాగ్రత్తగా ఆలోచించే శక్తి పెరుగుతుంది.

చుట్టుపక్కల ఉన్న వారిలో ఎవరైనా ప్రతికూలంగా మాట్లాడితే లేదా నిరుత్సాహపరిచేలా ప్రవర్తిస్తే వారి నుంచి కొంత దూరం తీసుకోవడం మంచిది. ఈ చర్య వల్ల మన ఆలోచనలు భయాందోళనల వైపు వెళ్లకుండా నిరోధించవచ్చు.

మనస్సులో ఉండే ఒత్తిడిని కొంత వరకు తగ్గించేందుకు ఆ ఆలోచనలను కాగితం మీద రాయడం మంచిది. ఇలా భావాలను రాసే ప్రక్రియ ద్వారా మనలో దాగి ఉన్న భావోద్వేగాలు బయటపడతాయి. ఇది మనసుకు ఓరకమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది.

సమయానుకూలంగా స్నేహితులతో లేదా కుటుంబంతో కలిసి ప్రకృతిని ఆస్వాదించే విహారయాత్రలకు వెళ్లడం వల్ల మనస్సు హాయిగా మారుతుంది. కొత్త ప్రదేశాలు చూస్తే కొత్త అనుభూతులు కలుగుతాయి. అనవసర ఆలోచనల నుంచి కొంత రిలీఫ్ లభిస్తుంది.

ప్రతి పని చేసే సమయంలో పూర్తిగా దానిలోనే మునిగిపోయే అలవాటు పెంపొందించుకుంటే మనస్సు అదుపులో ఉంటుంది. గతం, భవిష్యత్తు గురించి కాకుండా ప్రస్తుతానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

ఈ సులభమైన మార్గాల ద్వారా అతిగా ఆలోచించే అలవాటును నియంత్రించవచ్చు. ప్రతి దినచర్యలో ఈ పద్ధతులను ప్రాక్టీస్ చేస్తే నెమ్మదిగా మనస్సు క్రమంగా హాయిగా మారుతుంది. అనవసర ఆలోచనలు దూరమవుతాయి.

దేవుడు పిలుస్తున్నాడు.. నేను వెళుతున్నానంటూ చెప్పాడు.. చివరకు..
దేవుడు పిలుస్తున్నాడు.. నేను వెళుతున్నానంటూ చెప్పాడు.. చివరకు..
ఈ పండు రోజుకొకటి తింటే చాలు.. మీ గుండెకు శ్రీరామ రక్ష..!!
ఈ పండు రోజుకొకటి తింటే చాలు.. మీ గుండెకు శ్రీరామ రక్ష..!!
కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..
కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..
సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..