Nail biting habit: కొందరు టెన్షన్‌లో ఉన్నప్పుడు గోళ్లు కొరుకుతూ కనిపిస్తారు. మరికొందరు ఆనందంలో ఉన్నప్పుడు గోళ్లు కొరుకుతూ కనిపిస్తారు. ఇంకొందరు ఏ పని లేకుండా ఖాళీగా ఉంటే చాలు.. గోళ్లు కొరికేస్తారు. ఈ అలవాటు మంచిదికాదని పెద్దలు చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. గోళ్ల కొరకడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. ఈ అలవాటు ఎక్కువగా బాల్యంలో ఉంటుంది. క్రమేణా పెద్దయినా కూడా కొందరు ఈ అలవాటు మానలేరు. వైద్య పరిభాషలో ఈ అలవాటును ఒనికోఫాగియా అంటారు. గోళ్లు కొరికే అలవాటును ఎలా ఏర్పడుతుందో చెప్పేందుకు ఒక కారణమంటూ లేదు. కానీ, కొందరికి.. వారు ఫేస్ చేసే రోజువారి పరిస్థితుల వల్ల ఈ అలవాటు వస్తుంది. ఒంటరిగా ఉన్నా, ఫ్రస్ట్రేషన్‌కు గురైనా కొంతమంది గోళ్లను కొరుకుతుంటారు. గోళ్లు కొరకడాన్ని వారు ఉపశమనంగా భావిస్తారు. అది ఆ సమయంలో వారికో పనిలా అనమాట. గోళ్లను కొరకడం వల్ల భయం, ఆత్రుత నుంచి కొందరికీ టెంపరరీ రిలీఫ్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో గోళ్లు కొరికే అలవాటును మెంటల్ హెల్త్ కండీషన్‌కు సిగ్నల్‌గా కూడా భావిస్తారు. ఏడీహెచ్‌డీ, డిప్రెసివ్ డిజార్డర్, ఓసీడీ, ఆందోళనలకు గురయ్యేవారు ఎక్కువగా గోళ్లను కొరుకుతారని డాక్టర్స్ చెబుతున్నారు. ఈ అలవాటు మానకపోతే చాలా అనర్థాలు ఎదురవుతాయని వారు వెల్లడిస్తున్నారు.
గోళ్లను కొరకడం బ్యాడ్ హ్యాబిట్ మాత్రమే కాదు, అనారోగ్యానికి కూడా కొంతమేర కారణం. ఎందుకంటే గోళ్లల్లో ఉండే బ్యాక్టీరియా, క్రీములు వేళ్ల ద్వారా నోటిలోకి వెళ్లాయి. చేతి వేళ్లను నోట్లో పెట్టుకోవడం, కొరకడం వంటి అలవాట్ల వల్ల కడుపు, పేగు ఇన్ఫెక్షన్లు ఏర్పడవచ్చు.దీనివల్ల వేళ్లచివరి చర్మం దెబ్బతినడమే కాకుండా కణజాలం డ్యామేజ్ అవుతుంది. ఈ సమస్య ఏర్పడినప్పుడు గోళ్ల చుట్టూ పుండ్లు ఏర్పడతాయి. గోళ్లు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. ఆరోగ్యకరమైన వ్యక్తికి ఉండే గోళ్లతో పోల్చితే.. గోళ్లు కొరికే అలవాటు ఉండే వ్యక్తులు ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురవుతారు. ఈ అలవాటు మానుకోవాలంటే ప్రధానంగా చేయాల్సింది గోళ్లను కొరకు కూడదని మనసులో ప్రధానంగా అనుకోవడం. అలవాటు అతిగా ఉంటే.. గ్లౌవ్స్ ధరించడం ఉత్తమమైన పని. మహిళలు అయితే.. గోళ్లకు రంగు వేసుకోవడం ద్వారా ఈ అలవాటును కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఏ సమయంలో, ఏ కారణం వల్ల మీకు గోళ్లు కొరికే అలవాటు వచ్చిందనే విషయాన్ని తెలుసుకుని, జాగ్రత్తగా మసలుకోండి.
Also Read:
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సెలవులంటూ వైరల్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణాలు తీస్తున్న వివాహేతర సంబంధాలు.. దడ పుట్టిస్తున్న తాజా రిపోర్ట్