Bread Veg Rolls: యమ్మీ యమ్మీ వెజ్ రోల్స్ ని హెల్దీగా ఇలా చేయండి.. మొత్తం లాగించేస్తారు!!

| Edited By: Ravi Kiran

Sep 11, 2023 | 7:30 AM

సాక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. సాయత్రం అయ్యిందంటే చాలు.. ఏ బజ్జీలో, పునుగులో, సమోసాలో ఏవో ఒకటి పొట్లో పడాల్సిందే. అప్పుడు కానీ మనసు తృప్తిగా ఉండదు. ఇలా ఏవో బయటవి తినే కంటే.. ఇంట్లో హ్యాపీగా, హెల్దీగా ఉండే వాటిని చేసుకోవచ్చు. అందులోనూ బ్రెడ్ తో చేసేవి ఏమైనా.. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ తో సింపుల్ గా చేసుకునే వాటిల్లో బ్రెడ్ వెజ్ రోల్స్ ఒకటి. వీటిని ఒక్కసారి చేస్తే.. మళ్లీ మళ్లీ చేయమంటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఉదయం టిఫిన్ లా అయినా లేదా లంచ్ బాక్స్ లో, సాయంత్రం స్నాక్స్ లా ఎలా..

Bread Veg Rolls: యమ్మీ యమ్మీ వెజ్ రోల్స్ ని హెల్దీగా ఇలా చేయండి.. మొత్తం లాగించేస్తారు!!
Bread Veg Rolls
Follow us on

సాక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. సాయత్రం అయ్యిందంటే చాలు.. ఏ బజ్జీలో, పునుగులో, సమోసాలో ఏవో ఒకటి పొట్లో పడాల్సిందే. అప్పుడు కానీ మనసు తృప్తిగా ఉండదు. ఇలా ఏవో బయటవి తినే కంటే.. ఇంట్లో హ్యాపీగా, హెల్దీగా ఉండే వాటిని చేసుకోవచ్చు. అందులోనూ బ్రెడ్ తో చేసేవి ఏమైనా.. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ తో సింపుల్ గా చేసుకునే వాటిల్లో బ్రెడ్ వెజ్ రోల్స్ ఒకటి. వీటిని ఒక్కసారి చేస్తే.. మళ్లీ మళ్లీ చేయమంటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఉదయం టిఫిన్ లా అయినా లేదా లంచ్ బాక్స్ లో, సాయంత్రం స్నాక్స్ లా ఎలా అయినా ఇవి బాగానే ఉంటాయి. అయితే వీటిని అప్పటికప్పుడు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు లేట్.. బ్రెడ్ వెజ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి? వాటిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

బ్రెడ్ స్లైసెస్ – 5, పన్నీర్ తురుము – 100 గ్రాములు, క్యాప్సికం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి – చిన్నగా తరిగిన ముక్కలు కావాల్సినన్ని, కొత్తిమీర తరుగు – కొద్దిగా, మిరియాల పొడి – అర టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీ స్పూన్, బటర్ – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి సరిపడినంత.

ఇవి కూడా చదవండి

బ్రెడ్ వెజ్ రోల్స్ తయారీ విధానం:

ముందుగా పెద్దగా ఉండే బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని వాటికి ఉండే అంచులు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని చపాతీ కర్రతో నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. నెక్ట్స్ ఒక గిన్నెలో పన్నీరు తురుము, క్యాప్సికం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలపాలి. మీ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసెస్ మీద పెట్టుకోవాలి. బ్రెడ్ అంచులు ఊడిపోకుండా ఉండేలా.. నీటితో తడి చేసుకుంటూ నెమ్మదిగా బ్రెడ్ ను రోల్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ తయారు చేసుకున్నాక.. వాటిని ఒక పాన్ లేదా కడాయిలో కొంచెం బటర్ వేసి నెమ్మదిగా వేడి చేసుకోవాలి. అవసరమైతే కొంచెం బటర్ ను బ్రష్ తో రెల్స్ పై వేసుకోవచ్చు. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ వెజ్ రోల్స్ రెడీ. వీటిని టమాటా కిచప్ తో తింటే ఇంకా రుచిగా ఉంటాయి. అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి