Karivepaku-Vellulli Karam Podi: అన్నం, టిఫిన్ లోకి రుచిగా కరివేపాకు – వెల్లుల్లి కారం.. ఇలా చేస్తే అదిరిపోతుంది అంతే!!

| Edited By: Ravi Kiran

Sep 10, 2023 | 3:00 PM

చాలా మంది అన్నం, టిఫిన్ లలోకి కొన్ని రకాల పొడులను తయారు చేసుకుని తింటారు. ఎప్పుడైనా వంట్లో బాగోలేకపోయినా, ఏదైనా వెరైటీగా తినాలి అనిపించినప్పుడు ఈ కారం పొడులు వేసుకుని తింటూంటారు. లేదా కూరలు కలుపుకుని తినే ముందు అయినా వీటిని తింటే హెల్దీగా ఉంటారు. ఇది దాదాపుగా ఓ నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది కూడా. అందులో ఒకటి కరివేపాకు పొడి. ఇవి రెండూ కూడా మన వంట గదిలో అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ రెండింటితో చేసే కారం పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని..

Karivepaku-Vellulli Karam Podi: అన్నం, టిఫిన్ లోకి రుచిగా కరివేపాకు - వెల్లుల్లి కారం.. ఇలా చేస్తే అదిరిపోతుంది అంతే!!
Karivepaku Vellulli Karam Podi
Follow us on

చాలా మంది అన్నం, టిఫిన్ లలోకి కొన్ని రకాల పొడులను తయారు చేసుకుని తింటారు. ఎప్పుడైనా వంట్లో బాగోలేకపోయినా, ఏదైనా వెరైటీగా తినాలి అనిపించినప్పుడు ఈ కారం పొడులు వేసుకుని తింటూంటారు. లేదా కూరలు కలుపుకుని తినే ముందు అయినా వీటిని తింటే హెల్దీగా ఉంటారు. ఇది దాదాపుగా ఓ నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది కూడా. అందులో ఒకటి కరివేపాకు పొడి. ఇవి రెండూ కూడా మన వంట గదిలో అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ రెండింటితో చేసే కారం పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే.. అబ్బో మాటల్లో చెప్పలేం అంతే. అందులోనూ ప్రస్తుతం ఉన్న వర్షా కాలంలో ఈ పొడి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. వంట రాని వారు, బ్యాచిలర్స్ కూడా దీన్ని ఎంతో సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్.. కరివేపాకు-వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కరివేపాకు-వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు:

వెల్లుల్లి రెబ్బలు – 15, కరివేపాకు – రెండు గుప్పిళ్లు, నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, ధనియాలు – 4 టీ స్పూన్స్, మినపప్పు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతులు – చిటికెడు, ఎండు మిర్చి – 15, ఉప్పు – రుచికి సరిపడినంత, చింత పండు – చిన్న నిమ్మకాయంత సైజు

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి.. తడి లేకుండా ఆర బెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెయ్యాక శనగ పప్పు, మెంతులు, మినపప్పు వేసి చిన్న మంట మీద వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. నెక్ట్స్ ఎండు మిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించి.. పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును కరకరలాడేంత వరకు వేయించి.. స్టవ్ ఆఫ్ వేసి చల్లారనివ్వాలి.

వీటన్నింటినీ ఓ మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇందులో చింత పండు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్ల రెబ్బలు కూడా వేసి మరోసారి మిక్సీ తిప్పాలి. ఆ తర్వాత ఇదంతా కలిసేలా చేత్తో కలుపుకుని ఓ గాజు సీసాలో భధ్ర పరుచుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కరివేపాకు, వెల్లిల్లి కారం రెడీ. ఈ కారం నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అన్నం, టిఫిన్ లలోకి కూడా దీన్ని తీసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి