Health Tips: తియ్యటి మామిడిపండ్లని ఎలా ఎంచుకోవాలి.. ఈ చిట్కాలు పాటిస్తే సులువుగా తెలిసిపోతుంది..!

|

May 11, 2022 | 5:14 AM

Health Tips: వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్లోకి రకరకాల సీజనల్‌ పండ్లు రావడం మొదలవుతాయి. అయితే పండ్లలో రారాజు అయిన మామిడి కూడా ఈ సీజన్‌లోనే వస్తుంది.

Health Tips: తియ్యటి మామిడిపండ్లని ఎలా ఎంచుకోవాలి.. ఈ చిట్కాలు పాటిస్తే సులువుగా తెలిసిపోతుంది..!
Follow us on

Health Tips: వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్లోకి రకరకాల సీజనల్‌ పండ్లు రావడం మొదలవుతాయి. అయితే పండ్లలో రారాజు అయిన మామిడి కూడా ఈ సీజన్‌లోనే వస్తుంది. వేసవి నుంచి వానకాలం వరకు మార్కెట్‌లో అనేక రకాల మామిడి పండ్లు దొరుకుతాయి. ప్రజలు మార్చి నుంచే మామిడికాయల రాక కోసం ఎదురుచూస్తారు. కానీ ఏప్రిల్ వరకి మార్కెట్‌లోకి మామిడి కాయలు రావడం మొదలవుతుంది. అయితే సీజన్ ప్రారంభంలో మామిడి పండ్లను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చాలా సార్లు బయట నుంచి తాజాగా కనిపించే మామిడి లోపల నుంచి చెడు వాసన వస్తుంది. ఇలాంటివి ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే మంచి తియ్యటి మామిడిపండ్లని ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం.

మార్కెట్‌లో చాలా రకాల మామిడి పండ్లు ఉంటాయి. అవి పరిమాణం, రకం, రంగు, రుచిలో చాలా భిన్నంగా ఉంటాయి. మీరు మామిడిని కొనుగోలు చేసేటప్పుడు రంగు కంటే దాని తొక్క ఎలా ఉందో పరిశీలించండి. మామిడి సహజంగా పండినట్లయితే దాని తొక్కపై ఒక్క మరక కూడా ఉండదు. అలాగే మామిడిని రసాయనాలతో పండించినట్లయితే తొక్కపై నల్ల మచ్చలు కనిపిస్తాయి.

మామిడిపండ్లని కొనేముందు వాటిని కొద్దిగా నొక్కాడానికి ప్రయత్నించండి. మామిడి వాసన వస్తోందంటే సహజంగా పండినదని అర్థం. ఆల్కహాల్ లేదా కెమికల్ వాసన వస్తుంటే రసాయనాలతో పండించినవని అర్థం. పొరపాటున కూడా అలాంటి మామిడిని కొనవద్దు. ఇలాంటి పండ్లని తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అలాగే చాలా పండిన మామిడిని కొనకూడదు. ఎందుకంటే అవి లోపలి నుంచి కుళ్ళిపోయి ఉంటాయి.

మామిడికాయ తియ్యగా ఉందా లేదా అనేది సువాసనను బట్టి తెలుసుకోవచ్చు. మామిడిపండు కాండం దగ్గర వాసన చూస్తే తియ్యటి వాసన రావాలి. అప్పుడు అది మంచి పండని చెప్పవచ్చు. మామిడి నుండి వాసన రాకపోతే వాటిని కొనకూడదు. ఎందుకంటే అది లోపలి సగం పండుతుంది సంగం పండకుండా ఉంటుంది. మామిడి పండ్లు కొనేటప్పుడు వాటికి రంధ్రాలు ఉంటే వాటిని కొనుగోలు చేయకూడదు. అలాంటి మామిడి పండ్లలో క్రిమికీటకాలు ఉంటాయి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

AP News: చిత్తూరు జిల్లా ఆస్పత్రికి మాజీ మంత్రి నారాయణ.. వైద్య పరీక్షల నిర్వహణ.. మెజిస్ట్రేట్‌ ముందు హాజరు..

LSG vs GT: 80 పరుగులకే సర్దేసిన లక్నో.. 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన గుజరాత్

Health Tips: ఈ పప్పులో పోషకాలు పుష్కలం.. గుండె ఆరోగ్యానికి బెస్ట్‌..!