Periods: మెడిసిన్ లేకుండా పీరియడ్స్ తేదీని పొడిగించాలనుకుంటున్నారా? ఈ సహజ పద్ధతులు పాటించండి

|

Nov 25, 2022 | 10:38 AM

నేటి కాలంలో మహిళలు తమ పీరియడ్స్ తేదీని ముందుగానే పొడిగించుకునేలా మార్కెట్‌లో చాలా మందులు వాడుతుంటారు. ఈ మందులు..

Periods: మెడిసిన్ లేకుండా పీరియడ్స్ తేదీని పొడిగించాలనుకుంటున్నారా? ఈ సహజ పద్ధతులు పాటించండి
Periods
Follow us on

నేటి కాలంలో మహిళలు తమ పీరియడ్స్ తేదీని ముందుగానే పొడిగించుకునేలా మార్కెట్‌లో చాలా మందులు వాడుతుంటారు. ఈ మందులు మీ పీరియడ్స్ తేదీని కొన్ని రోజుల నుండి వారాల వరకు ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడతాయి. అయితే అవి దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటాయని అంటున్నారు వైద్య నిపుణులు. దీని వల్ల మహిళలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు వైద్యులను సంప్రదించి పీరియడ్స్ వచ్చే తేదీని ముందుకు తీసుకెళ్లడానికి మందులు తీసుకుంటే మీకు పెద్దగా హానీ ఉండదు. వైద్యులను సంప్రదించకుండా ఈ మందులను తీసుకునే మహిళలు చాలా మంది ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమని సూచిస్తున్నారు వైద్యులు. అటువంటి పరిస్థితిలో మీరు ఈ మందులను చాలా తక్కువగా ఉపయోగించడం చాలా ముఖ్యం. మీరు ఏదైనా కారణం వల్ల పీరియడ్స్ తేదీని పొడిగించవలసి వస్తే, మీకు చాలా సహాయపడే కొన్ని సహజ పద్ధతులను సూచిస్తున్నారు నిపుణులు. ఈ నేచురల్ పద్దతుల ప్రత్యేకత ఏంటంటే.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

  1. ఆపిల్ సైడర్ వెనిగర్: మీరు మీ పీరియడ్స్ తేదీని పొడిగించాలనుకుంటే గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. మీ గడువు తేదీకి 10 నుండి 12 రోజుల ముందు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల ఉబ్బరం, కడుపు తిమ్మిరి సమస్య నుండి బయటపడవచ్చు. ఇందులో ఉండే యాసిడ్ మీ పీరియడ్స్ ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది.
  2. ఆవాలు: ఒక చెంచా ఆవాలు నీళ్లలో/పాలలో రాత్రంతా నానబెట్టి పీరియడ్స్ రావడానికి వారం ముందు తినాలి. ఇది మీ పీరియడ్స్ ఆలస్యం రావడంలో సహాయపడతాయి. ఆవపిండిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. దీని కారణంగా మీ పీరియడ్స్‌ సమయం ఆలస్యంగా వచ్చేందుకు సహాయపడుతుంది.
  3. నిమ్మరసం: ఆపిల్ సైడర్ వెనిగర్ లాగా, గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల పీరియడ్స్ ఆలస్యం కావచ్చు. నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇది పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రవాహాన్ని తేలిక చేస్తుంది.
  4. జెలటిన్: జెలటిన్ పీరియడ్స్ తేదీని ఆలస్యంగా వచ్చే విధంగా చేస్తుంది. దీని కోసం వేడి నీటిలో జెలటిన్ ప్యాకెట్ కలపండి. మీకు ఎమర్జెన్సీ ఉంటే మీ పీరియడ్స్‌ను సుమారు 4 గంటలపాటు ఆలస్యం చేస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ముల్తానీ మిట్టి: ముల్తానీ మిట్టి పీరియడ్స్ తేదీని ముందుకు తీసుకెళ్లడానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం 25 నుండి 30 గ్రాముల ముల్తానీ మిట్టిని గోరువెచ్చని నీటిలో కలపండి. పీరియడ్స్ తేదీకి ఒక వారం ముందు తీసుకోండి. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మీ పీరియడ్స్ తేదీని ఆలస్యం చేస్తుంది. ఇది ఆయుర్వేదంలోనిది. ఇది మీకు చాలా సహాయపడుతుంది.
  7. దోసకాయ: దోసకాయ పీరియడ్స్ ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది. మీ పీరియడ్స్ ఆలస్యం కావడానికి చల్లని ఆహారాలు సహాయపడతాయని చెబుతున్నారు. దోసకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అందువల్ల మీ పీరియడ్స్ ఆలస్యం చేయడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పీరియడ్స్ వచ్చే తేదీకి ఒక వారం ముందు తీసుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి