Chest pain: తరచూగా వచ్చే ఛాతీ నొప్పికి ఇంటి చిట్కాలు.. చక్కటి పరిష్కారం పొందుతారు..

తేలికపాటి ఛాతీ నొప్పిని కొన్ని ఇంటి నివారణలను ఉపయోగించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. కానీ ఛాతీ నొప్పి తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే,

Chest pain: తరచూగా వచ్చే ఛాతీ నొప్పికి ఇంటి చిట్కాలు.. చక్కటి పరిష్కారం పొందుతారు..
Chest Pain

Updated on: Dec 15, 2022 | 6:56 PM

తరచూ ఛాతీ నొప్పి రావడం ఆందోళన కలిగించే విషయం. చాలా సార్లు ఈ సమస్య చాలా ఎక్కువగా వేధిస్తుంటుంది. ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ముందుగానే ఉపశమనం పొందడం చాలా ముఖ్యం. తేలికపాటి ఛాతీ నొప్పిని కొన్ని ఇంటి నివారణలను ఉపయోగించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. కానీ ఛాతీ నొప్పి తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే, ఛాతి నొప్పితో ఇబ్బంది పడుతున్న వాళ్లు ముందుగా కొన్ని ఇంటి చిట్కాలతో నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఛాతి నొప్పికి ఇంటి చిట్కాలు..
బాదంపప్పు:
ఆహారం తిన్న తర్వాత ఛాతీ నొప్పి వస్తే బాదం పప్పును రోజూ తినాలి. లేదా బాదం పాలు తాగండి. ఇలా చేయడం వల్ల ఛాతీ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల కూడా సమస్య పరిష్కారం అవుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ :
యాసిడ్ రిఫ్లక్స్ వల్ల వచ్చే ఛాతీ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో కలపండి. భోజనానికి ముందు లేదా తర్వాత తాగాలి. ఇలా చేయడం వల్ల ఛాతీ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

హాట్ డ్రింక్స్ :
గ్యాస్ కారణంగా ఛాతీ నొప్పి, ఉబ్బరం వంటి సందర్భాల్లో వేడి పానీయాలు తాగడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. దీంతో ఛాతీ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పసుపు పాలు:
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఛాతీ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాసు వేడి పాలలో ఒక చెంచా పసుపు కలుపుకుని తాగవచ్చు. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి