High Cholesterol: ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలా మందికి అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో కొలెస్ట్రాల్ సమస్య పెరిగిపోతోంది. కొలెస్ట్రాల్ అనేది రోజురోజుకు విస్తరిస్తోంది. భారతదేశంలో15-20 శాతం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25-30 శాతం మంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కొలెస్ట్రాల్ అన్ని శరీర క ణాలలో కనిపించే కొవ్వు లాంటి పదార్థం. దీని కారణంగా కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యం (Heart Health), గుండె జబ్బులు, స్టోక్స్ కు ప్రధాన కారణంగా మారుతోంది. మరో వైపు దేశంలో మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒక నివేదిక ప్రకారం.. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ నుంచి 12 మంది పెద్దలలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో 74 మిలియన్ల కంటే ఎక్కువ మంది మధుమేహం (Diabetes) రోగులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. డిసెంబర్ 2020లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత్లో మరో 40 మిలియన్ల మంది పెద్దలు గ్లూకోస్ టాలరెన్స్ (IGT) కారణంగా బలహీనంగా ఉన్నారని తెలుస్తోంది. వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, అయితే సగం కంటే ఎక్కువ మంది (53.1) శాతం మధుమేహంతో జీవిస్తున్నారని పేర్కొంది.
గుండె పనితీరు మందగించడం
గుర్గావ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, క్లినికల్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ ఇమేజింగ్ డైరెక్టర్, హెడ్ డాక్టర్ వినాయక్ అగర్వాల్ , హై కొలెస్ట్రాల్, డయాబెటిస్ అనేవి కార్డియోవాస్కులర్ డిసీజ్ స్పెక్ట్రం పెరుగుదలకు దారితీసే అత్యంత సాధారణ ప్రమాద కారకాల గురించి తెలియజేశారు. కొలెస్ట్రాల్ కారణంగా గుండె సమస్యలు, గుండె పనితీరు మందగించడం, ఇతర సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని తెలిపారు. అధిక కొలెస్ట్రాల్ ఎక్కువ గుండెకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం మరింత పొంచివుండే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. టైప్ 2 మధుమేహం అనేది దీర్ఘకాలిక పరిస్థితి. జీవనశైలి, శరీర బరువు, ఆహారపు అలవాట్ల కారణంగా మరింత తీవ్రత ఉండే అవకాశం ఉంది. టైప్ 1 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు గుండె జబ్బులకు దోహదపడే లిపిడ్ ప్రొఫైల్‌లను కలిగి ఉంటారు.
వ్యాయామంతో ఆరోగ్యం
సాధారణ జీవనశైలి మార్పుల ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. జీవనశైలి మార్పులు చేసుకోవడం తప్పనిసరి. వారానికి నాలుగైదు రోజుల పాటు కనీసం 40 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మీ ఆహారంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గడం, తక్కువ జంక్ ఫుడ్, పిజ్జాలు, చిప్స్, వాఫ్ఫల్స్ వంటి వాటిని నివారించవచ్చని డాక్టర్ అగర్వాల్ చెప్పారు. ఈ రోజుల్లో పిల్లలు కూడా జంక్ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. అది వారి బరువు, ఆరోగ్యానికి దారి తీసే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించడం మంచిది. ముందు జాగ్రత్త వల్ల నివారణ చర్యలు చేపట్టవచ్చంటున్నారు నిపుణులు. వేయించిన ఆహారాన్ని తగ్గించడం ఎంతో మంచిది. అలాగే జంక్ ఫుడ్, అర్థరాత్రి సమయంలో తినడం మంచిది కాదంటున్నారు.
ఇలాంటి రోగులలో సాధారణ జీవనశైలి మార్పుల ద్వారా ఈ ప్రమాద కారకాల ప్రభావాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. మీ ఆహారంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వారంలో కనీసం 40 నిమిషాల పాటు క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం ఎంతో మంచిది. అలాగే జీవన శైలిలో మార్పలు చేసుకోవడం వల్ల గుండె ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం:
సాధారణంగా కొన్ని కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి మంచివైతే.. మరి కొన్ని చెడుకు దారి తీస్తాయి. అన్ని కొవ్వు పదార్థాలు అనారోగ్యకరమైనవి కావు. పిజ్జాలు, బర్గర్లలో ఉండే కొవ్వులు అనారోగ్యకరమైనవి. కానీ అవకాడోలు, నెయ్యి, కొబ్బరికాయలోవి ఆరోగ్యానికి మంచివి. అందుకని మీ డైట్‌కి ఆరోగ్యకరమైన కొవ్వులను జతచేయటం వలన అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
మాంసపు పదార్థాలు అధికంగా తినడం:
మీరు మాంసాహారులైతే, దాదాపు ప్రతిరోజూ మాంసం వంటకాలు తినేవారైతే మీరు ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గోమాంసం, పందిమాంసం వంటి మాంసాలు తినటం వలన కొలెస్ట్రాల్ మరింత పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీరు దాని బదులు సన్నని మాంసాలైన చికెన్, సముద్రపు ఆహారం వంటి ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోవడం మంచిది.
అధిక బరువు పెరగడం
అధిక కొలెస్ట్రాల్ పలు వ్యాధులకు కారణమవుతాయి. అధిక కొలెస్ట్రాల్ బరువు పెరగటానికి కారణమైతే, బరువు పెరగటం కొలెస్ట్రాల్ పెరుగుదలకి కారణమవుతుంది. అందుకని మీ కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం మీరు బరువు, శరీరంలో కొవ్వు స్థాయి రెండూ తగ్గించుకోవడం మంచిది. కఠినమైన డైట్, వ్యాయామం వంటివి వైద్యుల సూచనలు, సలహాలు పాటించడం తప్పనిసరి.
మానసిక ఒత్తిడి:
ప్రస్తుతమున్న రోజుల్లో చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. దీని వల్ల తలనొప్పుల నుంచి, మానసిక ఒత్తిడి మరీ కాన్సర్ లాంటి భయంకర రోగాలకి కూడా కారణమవ్వచ్చు. అందుకని మానసిక ఒత్తిడిని అదుపులో పెట్టుకోవటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు.
కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడం అంటే సరైన జీవన విధానం ఉండాలి. అలానే మందులు కూడా వేసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు మందులు ఉపయోగిస్తే మంచిది. ఇక మన జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అని చూస్తే… ఆల్కహాల్, పొగాకుకి దూరంగా ఉండాలి. ఆల్కహాల్‌కి దూరంగా ఉంటే హై కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలానే తీసుకునే ఆహారం విషయానికి వస్తే.. సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉండే వాటిని తీసుకోవడం మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. బరువు బాగా పెరగకుండా చూసుకోవాలి. అధిక బరువు వంటి వాటి వల్ల కొలెస్ట్రాల్ పెరిగి పోతుంది కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు నిపుణులు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి