Telugu News » Photo gallery » These indian super foods are best in fat burning and giving nutrients in telugu
Fat Burning: కొవ్వుని కరిగించడంలో ఈ ఇండియన్స్ సూపర్ ఫుడ్స్ సూపర్..!
Fat Burning: బరువు తగ్గడానికి ప్రయత్నించే వ్యక్తులు పోషకాహారం తీసుకోరు. అయితే భారతీయ వంటగదిలో ఉండే అనేక పదార్థాలు కొవ్వును కరిగించడంతో పాటు శరీరానికి కూడా
బరువు తగ్గడానికి ప్రయత్నించే వ్యక్తులు పోషకాహారం తీసుకోరు. అయితే భారతీయ వంటగదిలో ఉండే అనేక పదార్థాలు కొవ్వును కరిగించడంతో పాటు శరీరానికి కూడా పోషకాహారాన్ని అందిస్తాయి. అలాంటి భారతీయ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
1 / 5
వాము: మసాలాగా ఉపయోగించే వాము జీవక్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరిచేందుకు ప్రతి రోజూ ఉదయం పూట వాము నీటిని తాగాలి.
2 / 5
మజ్జిగ: భారతదేశంలో వేసవిలో దీనిని ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఇది బరువును తగ్గిస్తుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఉంటాయి. అలాగే ఇది కొవ్వును కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
3 / 5
ఓట్ మీల్: నేటికీ ఇళ్లలో అల్పాహారంగా ఓట్ మీల్స్‌ని తీసుకుంటారు. ఇది తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. సులువుగా బరువు తగ్గవచ్చు.
4 / 5
పెసర్లు: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పప్పులు బరువు తగ్గడానికి పనిచేస్తాయి. మాంసకృత్తులు అధికంగా ఉండే పెసర్లు నానబెట్టి ఉదయాన్నే తింటే చాలా మంచిది. ఇది కొవ్వును కరిగించడమే కాకుండా మీకు ఆహార కోరికలు కలగకుండా చేస్తుంది.