Health Tips: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..? ఇలా చేయండి..!

|

Feb 06, 2022 | 1:00 PM

Health Tips: ప్రస్తుతం అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అధిక ఒత్తిడి, నిద్రలేనితనం తదితర..

Health Tips: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..? ఇలా చేయండి..!
Follow us on

Health Tips: ప్రస్తుతం అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అధిక ఒత్తిడి, నిద్రలేనితనం తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మన అరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఇక ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటు (High Blood Pressure)తో బాధపడేవారు పెరిగిపోతున్నారు. ఉప్పు, మ‌సాలాలు, ప్రాసెస్డ్ ఆహారాల‌కు దూరంగా ఉండ‌టంతో అధిక ర‌క్త‌పోటును అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే బీపీ (BP) ఉన్న వాళ్లు పచ్చళ్లు, ప్యాకేజీ ఫుడ్డు తదితర ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని ప్ర‌ముఖ డైటీషియ‌న్ డాక్టర్ అమ్రీన్ షేక్ చెబుతున్నారు.

ఈ పదార్థాలతో ఇబ్బందులు..

ఇక బీపీ రోగులు సోడియం ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలని, ఒక వేళ తీసుకున్నట్లయితే కార్డియోవాస్క్యుల‌ర్ ఇబ్బందులు త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. పోటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి ఎక్కువగా పదార్థాలను తీసుకోవాలని, అలాగే కొవ్వులు, చ‌క్కెర‌లు త‌క్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉంఆడే డెయిరీ ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలంటున్నారు.

ఇవి కూడా  చదవండి:

Ragi Java: రాగిజావతో అద్భుతమైన ఉపయోగాలు.. రాగుల్లో ఉండే ప్రోటీన్స్‌ ఏమిటి..?

Pumpkin Seeds: గుమ్మడి గింజలను తినడం వలన మహిళలకు ఎన్నో ప్రయోజనాలు.. PCOS సమస్యకు చెక్..