
కొలెస్ట్రాల్ ని కూడా సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఏమాత్రం లక్షణాలను చూపించకుండా మనిషికి ప్రాణాంతకంగా మారుతుంది. సాధారణంగా అది ముదిరిన దశలోనే వైద్యుడి వద్దకు వెళ్లినప్పుడు మాత్రమే రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. అయితే శరీరంలో చెడు కొవ్వు (బ్యాడ్ కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉంటే ముఖంపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇది హార్ట్ స్ట్రోక్ కు కారణం అవుతుంది. కొవ్వు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ఒకవేళ కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకున్నా.. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. లేదంటే రక్తంలో కొవ్వు పేరుకుపోతుంది. శరీరంలో చెడు కొవ్వు పెరిగితే కనిపించే లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కంటి కింద చారలు(శాంథెలాస్మాస్): కంటి కింది భాగంలో పసుపు, కుంకుమ రంగులో గీతలు కనిపిస్తాయి. చర్మంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది. ఇవి తాకడానికి చాలా మృదువుగా ఉంటాయి. వీటిని శాంతోమాస్ అని.. ఈ పరిస్థితిని శాంథెలాస్మాస్ అని పిలుస్తారు. సాధారణంగా అసమతుల్య లిపిడ్ ప్రొఫైల్ ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని మీరు గమనించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
కార్నియల్ ఆర్కస్.. ఇది కార్నియా చుట్టూ కనిపించే సన్నని తెల్లని గీత. యూఎస్ నేషనల్ హార్ట్, లంగ్, బ్లడ్ ఇన్స్టిట్యూట్ (ఎన్హెచ్ఎల్బీఐ) ప్రకారం కార్నియల్ ఆర్కస్ అనేది అధిక కొలెస్ట్రాల్ కు అతి పెద్ద సూచిక. అధిక కొలెస్ట్రాల్ ఉన్న కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులు కార్నియల్ ఆర్కస్‌ను అభివృద్ధి చేస్తారని ఇది చెబుతోంది.
ఎరప్టివ్ క్సాంతోమా.. ముఖం, బుగ్గలు, నుదిటిపై నారింజ లేదా చర్మం రంగు గడ్డలు కూడా అధిక కొలెస్ట్రాల్‌ను సూచిస్తాయి. ఇవి పిరుదులు, మోచేతులు, చేతులు మరియు మోకాళ్లపై కూడా కనిపిస్తాయి. శరీరంపై ఎరప్టివ్ క్సాంతోమా ఉండటం శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిని సూచిస్తుంది.
సోరియాసిస్.. మీ ముఖం, శరీరంలోని ఇతర భాగాలపై చర్మం ఎరుపు, దురద పాచెస్‌ను మీరు గమనించినట్లయితే వెంటనే చికిత్స పొందండి. దీనిని సోరియాసిస్ అని పిలుస్తారు, ఇది రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉన్న వ్యక్తులలో కూడా కనిపించే ఒక తాపజనక చర్మ పరిస్థితి.
చర్మంపై ప్రభావం.. రక్తంలో చేరిన అదనపు కొలెస్ట్రాల్ చర్మం కింద పేరుకుపోతుంది. ఈ కొలెస్ట్రాల్ చిన్న రక్త నాళాలను కూడా అడ్డుకుంటుంది కొన్ని ప్రదేశాలలో చర్మం రంగు మారడానికి దారితీస్తుంది. చర్మానికి ఆక్సిజన్ సరఫరాను నిలిపివేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ చర్మపు అల్సర్లకు కూడా దారి తీస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..