Cases Of Heart Attacks: శీతాకాలంలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతాయ్న విషయం తెలిసిందే. గుండెపోటు.. ప్రధాన లక్షణాలు ఛాతీ నొప్పి, తల తిరగడంతోపాటు శరీరం కొన్ని ఇతర చిన్న సంకేతాలను ఇస్తుంది. అయితే.. ప్రజలు వీటిని తరచుగా విస్మరిస్తూ.. ప్రమాదాన్ని మరింత పెంచుకుంటారు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తిస్తే.. గుండెపోటు ప్రమాదాన్ని నివారించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. గుండెపోటును సకాలంలో గుర్తించడం, దీంతోపాటు పలు అలవాట్లకు దూరంగా ఉంటే.. గుండెపోటు నివారించవచ్చంటున్నా రాజీవ్ గాంధీ హాస్పిటల్‌లోని కార్డియాలజిస్ట్ డాక్టర్ అజిత్ కుమార్. ఛాతీ నొప్పితో పాటు, శరీరంలోని ఇతర గుండెపోటు లక్షణాలు తేలికపాటి గుండెపోటుకు కారణమవుతాయి. సకాలంలో చికిత్స తీసుకోని వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీని కోసం ఈ ఇతర లక్షణాలను కూడా గుర్తించడం అవసరం అని అజిత్ కుమార్ పేర్కొన్నారు.
ఆ నొప్పులు సంకేతమే..
దవడ, ఎడమచేతి నొప్పి కూడా గుండెపోటు లక్షణమేనని డాక్టర్ అజిత్ తెలిపారు. దవడ వెనుక నొప్పిని తేలికగా తీసుకోకూడదు. ఏదో ఒక దంత సమస్య వల్ల ఇలా జరుగుతోందని చాలా సార్లు అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో ఇది గుండెపోటుకు సంబంధించిన లక్షణమని తేలింది. సకాలంలో చికిత్స చేయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇందులో దవడ నుంచి నొప్పి మొదలై మెడ వరకు వ్యాపిస్తుంది. ఈ లక్షణాలు వచ్చిన వెంటనే గుండె పరీక్షలన్నీ చేయించుకుంటే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. దీనితో చికిత్స కూడా సులభమని.. బాధితులను రక్షించవచ్చని పేర్కొన్నారు.
శ్వాస ఆడకపోవడం కూడా సంకేతమే..
డాక్టర్ ప్రకారం.. కాసేపు నడిచిన తర్వాత లేదా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప్రారంభమైతే అది గుండెలో ఏదో సమస్య ఉన్నట్లు లక్షణం. ఇది మరింత ప్రమాదానికి దారితీయవచ్చు. శ్వాస ఆడకపోవడం లక్షణాలు పురుషులు, స్త్రీలలో కనిపిస్తాయి. ఇలాంటి సమస్య ఒకటి రెండు సార్లు వచ్చినా భయపడాల్సిన పనిలేదు. కానీ, ఈ సమస్య రెండు మూడు రోజులు కొనసాగితే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది గుండెపోటు ప్రారంభ లక్షణం. కాబట్టి దానిపై శ్రద్ధ వహించాలి.
డాక్టర్ సలహాలు..
మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి
తాజా ఆహారాన్ని తీసుకోవాలి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
చల్లని ప్రాంతాల్లో ఉన్నప్పుడు.. బిగుతు దుస్తులు ధరించాలి
సాధ్యమైనంతవరకు శీతల ప్రదేశాలకు దూరంగా ఉండాలి
మద్యం, పొగ తాగవద్దు
Also Read: