AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dieting Tips: డైటింగ్ చేసేటప్పుడు.. ఈ టిప్స్ పాటిస్తే.. మంచి ఫలితాలు ఉండొచ్చు..

మారుతున్న జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత తగ్గించడంతో చాలా మంది బరువు పెరగడంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో విషయం తెలసుకున్నాక.. చాలా మంది బరువు తగ్గేందుకు డైటింగ్..

Dieting Tips: డైటింగ్ చేసేటప్పుడు.. ఈ టిప్స్ పాటిస్తే.. మంచి ఫలితాలు ఉండొచ్చు..
Break Fast Tips
Amarnadh Daneti
|

Updated on: Oct 17, 2022 | 10:24 PM

Share

మారుతున్న జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత తగ్గించడంతో చాలా మంది బరువు పెరగడంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో విషయం తెలసుకున్నాక.. చాలా మంది బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నారు. రోజూ తినే ఆహారంలో.. తీసుకునే సమయంలో.. పరిమాణంలో అనేక మార్పులు చేసుకుని.. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొంత మంది ఈడైటింగ్ ను పర్ ఫెక్ట్ గా ఫాలో అవుతుంటే మరికొంత మంది ఏదో నామ్ కీ వాస్త్ అన్నట్లు చేస్తున్నారు. అయితే కొంత మంది ప్లాన్ ప్రకారం డైటింగ్ చేస్తున్నా.. ఫలితం మాత్రం కన్పించదు. ఎందుకంటే ఈడైటింగ్ లో కొన్నిసార్లు చిన్న చిన్న లాజిక్ లు మిస్ అవుతూ ఉంటారు. మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ టైమ్ లోనే ఈడైటింగ్ టిప్స్ ను ఫాలో అవుతూఉంటారు.

డైటింగ్ చేసే వారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో కొద్దిగా ఎక్కువ ఆహారం తీసుకుంటుంటారు. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువ మొత్తం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోనే చేసేస్తే క్యాలరీలు సమర్థవంతంగా ఖర్చు చేయవచ్చు, తద్వారా బరువు తగ్గించుకోవచ్చు అనే భావన కూడా చాలా మందిలో ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది.

అల్పాహారం అంటేనే అల్పంగా, తక్కువ పరిమాణంలో తీసుకునేది అని అర్థం. తాజాగా చేపట్టిన ఒక అధ్యయనం ప్రకారం ఒక రోజులో ఎక్కువ మొత్తంలో ఆహారం ఏ సమయంలో తిన్నప్పటికీ, అది బరువును ఎంత మాత్రం ప్రభావితం చేయదు. అల్పాహారం ఎక్కువ మొత్తంలో తింటే బరువు తగ్గుతారనేది అపోహ మాత్రమేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. అందుకే డైటింగ్ చేసేటప్పుడు మన సందేహాలను డైటీషియన్స్ లేదా ఆరోగ్య నిపుణులను అడిగి నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది. వారి సలహాలు, సూచనల ప్రకారం సరైన పద్ధతిలో డైటింగ్ చేస్తే మాత్రం ఆశించిన ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్