Health Tips: పండ్లు తినేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!

Health Tips: సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే సీజన్‌కు అనుగుణంగా వచ్చే పండ్లను తినాలని సూచిస్తారు. రోజూ కనీసం 1, 2 పండ్లు తింటే శరీరం ఆరోగ్యవంతంగా,

Health Tips: పండ్లు తినేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!
Fruits
Follow us

|

Updated on: Apr 17, 2022 | 6:33 AM

Health Tips: సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే సీజన్‌కు అనుగుణంగా వచ్చే పండ్లను తినాలని సూచిస్తారు. రోజూ కనీసం 1, 2 పండ్లు తింటే శరీరం ఆరోగ్యవంతంగా, బలిష్టంగా తయారవుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో పండ్లు ఎక్కువగా తినాలి. పండ్లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా.. ఉదర సమస్యలు, జీర్ణశక్తి, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి పండ్లు కూడా చాలా సహాయపడతాయి. డైటింగ్ చేసే వారు ఎక్కువగా పండ్లు తీసుకోవాలి. అయితే, పండ్ల ద్వారా వచ్చే పూర్తి పోషకాహారాన్ని పొందడానికి, మీరు సరైన విధంగా పండ్లను తినడం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది పండ్లు తినేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దాని వల్ల పండ్లలోని పూర్తి పోషకాలు శరీరానికి అందవు. పండ్లు తినడంలో ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

1- పండ్లను ఎక్కువసేపు కోసి ఉంచవద్దు: కొందరు తినడానికి చాలా కాలం ముందు పండును కట్ చేస్తారు. ఆఫీసుకు వెళ్లేవారు కోసిన పండ్లను టిఫిన్‌లలో తీసుకువెళతారు. కొంతమంది పండ్లను ఉదయాన్నే కోసి ఉంచుతారు. కానీ అలా చేయడం వల్ల పండులోని పోషకాలు నశిస్తాయి. దీని ద్వారా మీరు పండ్లు తినడం వల్ల పూర్తి ప్రయోజనం పొందలేరు. తినాలనుకున్న సమయంలో పండ్లను కోసి తినండి.

2- ఎక్కువ ఉప్పు వేసుకుని పండ్లను తినకండి: కొంతమంది పండ్లలోని పోషకాలను నాశనం చేసే బ్లాక్ సాల్ట్, చాట్ మసాలాను ఎక్కువగా కలుపుకుని పండ్లను తింటారు. ఫ్రూట్ సలాడ్ తింటున్నప్పుడు పండ్లపై ఎక్కువ ఉప్పు వేయకండి. దీని కారణంగా పండ్ల యొక్క సహజ లక్షణాలు దెబ్బతింటాయి. ఇంకా ఎక్కువ సోడియం మీ శరీరానికి చేటు చేస్తుంది.

3- పండ్ల తొక్కను తీసేయొద్దు: మామిడి, అరటి, బొప్పాయి, దానిమ్మ వంటి కొన్ని పండ్లు ఉన్నాయి. వీటిని తొక్క తీసి తర్వాత తింటారు. అంతే కాకుండా యాపిల్, జామ వంటి పండ్లను తొక్కతో పాటు తినాలి.

4- పాలు, కాఫీ-టీలతో పుల్లని పండ్లను తినవద్దు: పుల్లని పండ్లను తీసుకుంటే, వాటిని టీ, పాలు లేదా కాఫీతో తినకూడదు. కొంతమంది ఫ్రూట్ సలాడ్‌ని కాఫీతో కలిపి తింటారు. అలా చేస్తే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ఈ అలవాటు కారణంగా ఉదర సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఖాళీ కడుపుతో సిట్రస్ పండ్లను అస్సలు తినొద్దు.

Also read:

Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

Viral Video: ఈ రైతు చాలా స్మార్ట్ గురూ.. పొలం పనుల్లో సరికొత్త ప్రయోగం.. మీకూ ఉపయోగపడొచ్చు ఓ లుక్కేయండి..!

Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..