Health Tips: మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త.. వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే..!

|

Sep 08, 2022 | 2:15 PM

Health Tips: గుండె, మెదడు ఎంత ముఖ్యమో.. మూత్రపిండాలు కూడా మన శరీరానికి అంతే ముఖ్యం. మనస్సును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి..

Health Tips: మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త.. వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే..!
Kidney Health
Follow us on

Health Tips: గుండె, మెదడు ఎంత ముఖ్యమో.. మూత్రపిండాలు కూడా మన శరీరానికి అంతే ముఖ్యం. మనస్సును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం ద్యానం చేసినట్లే.. మంచి ఆహారం, దినచర్యను పాటిస్తాం. ఇదే మాదిరిగా కిడ్నీపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. చాలా మంది కిడ్నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కిడ్నీ సంబంధితన సమస్యలు తలెత్తితే మన శరీరంలో కొన్ని లక్షణాలు చూపిస్తుంది. అయితే, చాలా మంది వాటిని నిర్లక్ష్యం చేస్తూ.. ఆస్పత్రులపాలయ్యేంత వరకు లైట్ తీసుకుంటారు. ఒకసారి కిడ్నీలు పాడైతే.. కోలుకోవడం చాలా కష్టం. అందుకే.. ఆ లక్షణాలు కనిపించిన వెంటనే అలర్ట్ అవ్వాలని సూచిస్తున్నారు వైద్యులు. సరైన సమయంలో చికిత్స అందిస్తే సమస్య తగ్గుతుందని, లేదంటే ముప్పు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. మరి కిడ్నీ ఆరోగ్యం క్షీణించిన సమయంలో కనిపించే లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బాగా అలసిపోవడం..
శరీరంలో చిన్న చిన్న మార్పులను విస్మరిస్తే భయంకరమైన పరిణామాలు ఉంటాయి. చిన్నపాటి వ్యాయామం చేసినా శరీరం త్వరగా అలసిపోతుంది. దీనికి కారణం శరీరంలో టాక్సిన్స్ స్థాయి పెరగడం. ఈ పదార్థాలు శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. దీంతోపాటు రక్తంలో అశుద్ధ పదార్థాల పరిమాణం పెరగడం కూడా ప్రారంభమవుతుంది. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి.

నిద్రలేమి, చర్మ సమస్యలు..
నిద్రలేమి, చర్మ సమస్యలు తలెత్తినప్పుడు అలర్ట్ అవ్వాలి. ఈ సమస్యలు మూత్రపిండాల వ్యాధులతో సంబంధం కలిగి ఉంటాయి. వీటిని లైట్ తీసుకోవద్దు. లేదంటే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. చర్మం పొడిబారినట్లు, పొరలు పొరలుగా ఉండి, దురద సమస్యగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

కాళ్ల వాపు..
కాళ్ల వాపు కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులను సూచిస్తుంది. కాళ్లు విపరీతంగా వాచినట్లయితే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేదంటే.. కాలం గడుస్తున్నా కొద్ది సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..