Herbal Tea: తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో సతమతం అవుతున్నారా?.. అయితే, వీటిని ప్రయత్నించండి..

Herbal Tea: ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే వాటిలో అత్యంత ప్రసిద్ధి గాంచింది టి. శతాబ్ధాలుగా టి ఎంతో ప్రాచుర్యం పొందుతూ వస్తోంది. ముఖ్యంగా ఒక కప్పు హెర్బల్ టి..

Herbal Tea: తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో సతమతం అవుతున్నారా?.. అయితే, వీటిని ప్రయత్నించండి..
Herbal Tea

Updated on: Nov 16, 2021 | 10:09 PM

Herbal Tea: ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే వాటిలో అత్యంత ప్రసిద్ధి గాంచింది టి. శతాబ్ధాలుగా టి ఎంతో ప్రాచుర్యం పొందుతూ వస్తోంది. ముఖ్యంగా ఒక కప్పు హెర్బల్ టి.. ఎంతో మైండ్ రిలీఫ్ ఇస్తుంది. ప్రతీ ఉదయం, సాయంత్రం ఒక కప్పు హెర్బల్ టీ తాగడం వలన ఆరోగ్యంతో పాటు.. ఎంతో రిలాక్స్‌గా కూడా ఉంటుంది. ఒత్తిడితో, ఆందోళనతో బాధపడే వ్యక్తుల కోసం ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడే కొన్ని హెర్బల్ ‘టీ’ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అశ్వగంధ టీ..
అశ్వగంధ శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతూ వస్తోంది. ఇది సహజ పదార్ధం. శరీరక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని డికాక్షన్‌గా, టీగా తీసుకోవచ్చు. హార్మోన్ల అసమతుల్యత వల్ల మానసిక కల్లోలం, బరువు పెరుగుట, ఒత్తిడికి దారి తీస్తుంది. అశ్వగంధ శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. అశ్వగంధలో ఒత్తిడి, ఆందోళనతో పోరాడే డిస్ట్రెస్సింగ్ గుణాలు ఉన్నాయి. అందుకే ఇది చాలా మంచిది.

దాల్చిన చెక్క బ్లాక్ టీ..
దాల్చిన చెక్క శరీరానికి విశ్రాంతినిస్తుంది. దీనితో తయారు చేసిన టీ తాగడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చునని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక కప్పు టీలో దాల్చినచెక్కను వేయడం వల్ల టీ రుచి పెరగడమే కాకుండా.. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఊబకాయం, అధిక రక్తపోటుతో సహా అనేక సమస్యల నుంచి దూరం చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

గ్రీన్ టీ..
గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీని వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడం, రోగనిరోధక శక్తిని పెంచడం, నరాలపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రధానంగా టీ ప్లాంట్‌లో ఉండే థియనైన్ అనే అమినో యాసిడ్ ఒత్తిడిని దూరం చేస్తుంది. జపాన్‌లోని ఓ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో గ్రీన్ టీ తాగే విద్యార్థుల్లో ఒత్తిడి తక్కువగా ఉంటుందని తేలింది.

తులసి టీ..
తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని కణాలు, అవయవాలను నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. తులసి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. తులసి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు.

లావెండర్..
లావెండర్ టీ.. ఆందోళన, తలనొప్పి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. లావెండర్ టీ.. ఆ మొక్క ఎండిన మొగ్గల నుండి తయారవుతుంది. ఇది కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. నరాలను రిలాక్స్ చేస్తుంది. తద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది. తలనొప్పి, కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

Also read:

Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ సీరియస్.. వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్న సిరి.. ఆందోళనలో హౌస్‏మేట్స్..

Ramya Krishna: మెగాస్టార్ సినిమాలో రమ్యకృష్ణ.. కీలక పాత్రలో నటించనున్న శివగామి..