Health Tips: రివర్స్‌లో నడిస్తే చాలా ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు..

|

Mar 15, 2022 | 5:40 AM

Health Tips: వెనక్కి నడిచేవారిని చూసి నవ్వుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. వాస్తవానికి రివర్స్‌ వాకింగ్‌ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాధులు కూడా అలాంటి

Health Tips: రివర్స్‌లో నడిస్తే చాలా ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు..
Reverse Walking
Follow us on

Health Tips: వెనక్కి నడిచేవారిని చూసి నవ్వుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. వాస్తవానికి రివర్స్‌ వాకింగ్‌ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాధులు కూడా అలాంటి వారికి దూరంగా ఉంటాయి. అందుకే కొందరు తరచుగా రివర్స్‌లో నడుస్తారు. మీరు ఇప్పటివరకు అలా నడవకపోతే ఇప్పుడే ప్రారంభించండి. రివర్స్‌ వాకింగ్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. రివర్స్‌ వాకింగ్‌ వల్ల మీ మైండ్ ఫిట్‌గా ఉండటమే కాకుండా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనసుకు, హృదయానికి రెండింటికి మంచి జరుగుతుంది. మీరు దృష్టిని పెంచుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి రివర్స్‌ వాకింగ్‌ ప్రాక్టీస్ చేయండి. మీడియా నివేదికల ప్రకారం.. రివర్స్ వాకింగ్ ఉత్తమ కార్డియో వ్యాయామం. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మీరు కండరాలను బలంగా, చురుకుగా చేయాలనుకుంటే ఈరోజు నుంచే రివర్స్‌గా నడవడం ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి.

వెనక్కి వాకింగ్‌ చేయడం వల్ల ముందు వాకింగ్‌ చేసేదానికన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. రోజూ 10-20 నిమిషాల పాటు వెనక్కి వాకింగ్‌ చేస్తే వారంలో 2-3 సార్లు జాగింగ్‌ చేసిన దాంతో సమానం. దీని వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. ముందుకు వాకింగ్‌ చేయడం కన్నా వెనక్కి వాకింగ్‌ చేయడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేయవచ్చు. దీంతో కొవ్వు త్వరగా కరుగుతుంది. అధిక బరువు త్వరగా తగ్గుతారు.వెనక్కి వాకింగ్‌ చేయడం వల్ల శరీరం బ్యాలెన్స్‌గా ఉంటుంది. దీని వల్ల శారీరక ఆరోగ్యం మెరుగు పడుతుంది. శరీరం ఫిట్‌గా ఉంటుంది. ముందు వాకింగ్‌ చేయడం వల్ల కొన్ని కండరాల్లో కదలికలు ఉండవు. రివర్స్‌ వాకింగ్‌ వల్ల అలాంటి కండరాల్లో కదలికలు ఉంటాయి. దీంతో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Onions Side Effects: నిత్యం ఉల్లి లేనిదే ముద్ద దిగడం లేదా.. అయితే ఈ సమస్యలున్నవారు తింటే కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్లే

Health Tips: మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? అయితే, వీటిని అస్సలు తినొద్దు.. కాదని తిన్నారంటే అంతేసంగతులు!

Health Tips: ఆరోగ్యానికి మంచిదని వీటిని అతిగా తింటున్నారా.. అయితే, ఈ వ్యాధుల బారిన పడే ఛాన్స్..