
కిడ్నీ మన శరీరంలోని అన్ని విషపదార్ధాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మందికి కిడ్నీ స్టోన్ సమస్య తలెత్తుతుంది. కిడ్నీలో రాళ్ళు మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే ఎలాంటి.. లక్షణాల కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం..
మూత్ర విసర్జన సమస్య ఉందా.? అయితే మీకు కిడ్నీ స్టోన్ సమస్య ఉండవచ్చు. అప్పుడు మూత్రవిసర్జన సమయంలో నొప్పి కలుగుతుంది. కిడ్నీలో రాళ్ల పరిస్థితి తీవ్రంగా ఉంటే మూత్రంలో రక్తం వస్తుంది. ఈ సందర్భంలో, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మీ వెన్ను, కడుపులో నొప్పి ఉందా.? మీకు నిరంతరం కడుపు నొప్పి, వెన్నునొప్పి ఉంటే, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది కిడ్నీ స్టోన్ సమస్యను గుర్తుపట్టడానికి ముఖ్య లక్షణం. రాళ్ళూ మూత్రనాళంలోకి వెళ్లినప్పుడు మూత్రవిసర్జనలో తరచుగా అవరోధం కలుగుతుంది. మూత్రం సరిగ్గా వెళ్లకపోవడం వల్ల పొత్తికడుపు , వెనుక భాగంలో నొప్పి వస్తుంది. ఇంకా, మీ మూత్రం ఒక రకమైన వాసన కలిగి ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు ఉండవచ్చని అంచనా వేయవచ్చు.
ఈ ఆహారాలు తినండి మీకు కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే, మీరు మీ ఆహారంలో క్యారెట్, బీన్స్, పుచ్చకాయ, తులసి, దానిమ్మ, కొబ్బరి నీరు, పొట్లకాయ, మజ్జిగ, ముల్లంగి, జామున్ మొదలైన వాటిని చేర్చుకోవాలి. కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు ముల్లంగి చాలా మేలు చేస్తుంది. క్యారెట్‌లో కాల్షియం ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లను విచ్ఛిన్నం చేస్తుంది. తులసిని తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా శరీరంలోని మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి.