Health Tips: చూసేందుకు పిచ్చి మొక్కలానే ఉంటుంది.. 4 జబ్బులను నయం చేసే దివ్యౌషధం..

Health Tips: మన చుట్టూ ఉండే మొక్కలను పిచ్చి మొక్కలు అనుకుంటాం. కానీ, ప్రతీ ఒక్కలో ఏదో ఒక ఔషధ గుణం దాగుంది. మన పూర్వీకులకు ఈ విషయాలన్నీ తెలుసు.

Health Tips: చూసేందుకు పిచ్చి మొక్కలానే ఉంటుంది.. 4 జబ్బులను నయం చేసే దివ్యౌషధం..
Nelavemu
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 11, 2022 | 6:05 AM

Health Tips: మన చుట్టూ ఉండే మొక్కలను పిచ్చి మొక్కలు అనుకుంటాం. కానీ, ప్రతీ ఒక్కలో ఏదో ఒక ఔషధ గుణం దాగుంది. మన పూర్వీకులకు ఈ విషయాలన్నీ తెలుసు. అందుకే, ఆ కాలంలో వారు వీటిని తీసుకునే ఎంతో ఆరోగ్యంగా జీవించారు. ప్రస్తుత కాలంలో అయితే, ప్రతీ చిన్న సమస్యకు వైద్యుల వరకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఈ సంగతి ఇలాఉంటే.. ఆయుర్వేదంలో అసంఖ్యాక మూలికలు ఉన్నాయి. వాటిలో ఒకటి కల్మేఘం(నేలవేము). ఇందులోని ఔషధ గుణాలు.. అనేక రకాల జబ్బులను నయం చేస్తుంది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మూలికలలో ఇది కూడా ఒకటి. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని ఉపయోగించడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చు. ఇవాళ మనం నేలవేము ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నొప్పి నుండి ఉపశమనం..

నేలవేము అనాల్జెసిక్స్‌తో కూడిన ఆయుర్వేద ఔషధం. శరీరంలో నొప్పిని తగ్గించడానికి ఆయుర్వేదంలో దీనిని విరివిగా ఉపయోగిస్తారు. శరీరంలో వాపు, ఇనుము లోపాన్ని కూడా తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది..

జీర్ణ సమస్యలను దూరం చేయడానికి నేలవాము రసాన్ని సేవించవచ్చు. ఇది పొట్టను క్లియర్ చేయడంలో, మల విసర్జనలో ఇబ్బందిని తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా పిట్టా సమస్యను తగ్గించుకోవచ్చు.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది..

కాలేయాన్ని రక్షించడానికి నేలవేము తీసుకోవచ్చు. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా దీని వినియోగం ద్వారా లివర్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు.

వ్యాధుల సంక్రమణ నుండి రక్షణ..

నేలవేములో యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు దీన్ని తీసుకోవడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్, ఫ్లూ, జ్వరం వంటి సమస్యలు దూరమవుతాయి.

గమనిక: ఇది ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించి, చికిత్స పొందడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..