Health Tips: ఆవు పాలు, గేదె పాలు అంటే అస్సలు ఇష్టం లేదా? అయితే, ఈ మిల్క్ తాగితే డబుల్ బెనిఫిట్స్..!
Health Tips: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ తినాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Health Tips: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ తినాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది జీడిపప్పు ఎక్కువగా తీసుకుంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు.. జీడిపప్పును చాలా రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తారు. అదే సమయంలో, చాలా మంది జీడిపప్పును వేయించి తినడానికి ఇష్టపడతారు. అయితే మీరు ఎప్పుడైనా జీడిపప్పు పాలు తాగారా?
జీడిపప్పు పాలలో విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఐరన్, డైటరీ ఫైబర్, జింక్ మరియు ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మీకు ఆవు, గెదె పాలు అలెర్జీ అనిపిస్తే.. జీడిపప్పు పాలు తాగొచ్చు. ఈ పాలు అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీడిపప్పు పాల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జీడిపప్పు హెల్త్ బెనిఫిట్స్..
హృదయాన్ని ఆరోగ్యంగా..
జీడిపప్పు పాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది కాకుండా, ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. తద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. జీడిపప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా, పదిలంగా ఉంటుంది.
బరువు తగ్గడంలో..
బరువు తగ్గడంలో కూడా జీడిపప్పు అద్భుతంగా పని చేస్తుంది. బరువు తగ్గడంలో జీడిపప్పు పాలు ప్రభావవంతంగా ఉంటాయి. ఇందులో అనాకార్డిక్ యాసిడ్ అనే బయోటాక్టిక్ సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా జీడిపప్పు పాలు తాగితే ప్రయోజనం ఉంటుంది.
క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది..
జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే అనాకార్డిక్ యాసిడ్, కార్డోల్స్, కార్డనాల్స్, బోరాన్ శరీరంలో క్యాన్సర్ కణాలను పెరగనివ్వవు. దీంతో క్యాన్సర్‌ను నివారించవచ్చు.
జీడిపప్పు పాలను ఎలా తయారుచేయాలి?
జీడిపప్పు పాలు చేయడానికి.. 1 కప్పు జీడిపప్పు తీసుకోవాలి. దానికి 1 కప్పు నీళ్లు పోసి మిక్సీలో కలపాలి. ఆ తరువాత ఫిల్టర్ చేయాలి. మళ్లీ మిగిలిన జీడిపప్పులో నీళ్లు పోసి రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఫిల్టర్ చేయాలి. ఈ విధంగా జీడిపప్పు పాలు తయారు చేసుకోవచ్చు. శాకాహారి, ఆవు, గేదె పాలు అసహ్యం అనిపిస్తే.. జీడిపప్పు పాలు పుష్కలంగా తాగొచ్చు. ఇందులో కేలరీల పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..