AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seasonal Diseases: వర్షాకాలంలో వేప ఆకులతో ఇలా చేస్తే ఆ సమస్యలన్నీ హాంఫట్..

Seasonal Diseases: ఆకులు, కాయలు, బెరడు, కలప సహా మొత్తం ఔషధ గుణాలు దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన వరం వేప చెట్టు.

Seasonal Diseases: వర్షాకాలంలో వేప ఆకులతో ఇలా చేస్తే ఆ సమస్యలన్నీ హాంఫట్..
Neem Benefits
Shiva Prajapati
|

Updated on: Jul 27, 2022 | 7:37 AM

Share

Seasonal Diseases: ఆకులు, కాయలు, బెరడు, కలప సహా మొత్తం ఔషధ గుణాలు దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన వరం వేప చెట్టు. వేప పుల్లలతో పళ్లు తోముకోవడం వలన నోరు పరిశుభ్రమవడమే కాకుండా.. ఆరోగ్యంగానూ ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేప ఆకులు చర్మ సమస్యల నివారణలో అద్భుతంగా పని చేస్తుంది. వేపను అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. చర్మ సౌందర్య ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తున్నారు. అనామ్లజనకాలు, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు వేపలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో చర్మం, ఆరోగ్య సంరక్షణకు వేప దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇది వర్షాకాలంలో అనేక సమస్యల నుండి కాపాడుతుంది. వేప వలన కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

చర్మ సమస్యల నివారణం..

వర్షాకాలంలో దురద, దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలు రావడం సర్వసాధారణం. వేప ఆకులు ఈ సమస్యల నుండి మీకు చాలా వరకు ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం 12 నుంచి 15 ఆకులను ఒక లీటరు నీటిలో కలిపి అరగంట పాటు మరిగించాలి. ఈ నీటిని సాధారణ నీటిలో కలుపుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వలన చర్మానికి సంబంధించిన అన్ని రకాల ఇన్ఫెక్షన్లను తొలగిపోతాయి.

మధుమేహం నివారణిగా..

వేపలో ఫ్లేవనాయిడ్స్, టెర్పెనాయిడ్స్ వంటివి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అంతే కాకుండా వేపలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి. వీటి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు గోళ్లు, మొటిమలు మొదలైన అన్ని సమస్యలను నివారిస్తుంది.

ఉదర సంబంధిత సమస్యలు..

వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. వేప ఆకులను నిత్యం తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగుల సమస్య ఉండదు. వేప ఆకులు అసిడిటీ, ఆకలి లేకపోవడం వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. దీని వినియోగం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మొటిమల సమస్య.. శరీరంలో ఏ ప్రదేశంలోనైనా కురుపుల సమస్య ఉంటే.. వేప ఆకులతో పాటు దాని బెరడును రుబ్బి ఆ ప్రదేశంలో రాయాలి. కొద్ది రోజుల్లో ఆ సమస్య తొలగిపోతుంది.

వైరల్ ఫీవర్ నియంత్రణ..

వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇది కాలానుగుణ జబ్బులను నివారిస్తుంది. జ్వరం, వైరల్ ఫీవర్ మొదలైన సమస్యలను తొలగించడంలో వేప సహాయకరంగా పరిగణించబడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లో కూడా వేప ఆకులు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి.

శ్వాసకోశ సమస్యలు..

వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

(ఈ కథనంలో అందించిన సమాచారం ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని TV9 తెలుగు ధృవీకరించడం లేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..