Monkeypox: చిన్నపిల్లలకు మంకీపాక్స్ వచ్చే ప్రమాదం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

Monkeypox: ప్రపంచంలోని 71 కి పైగా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెంది. కొన్ని నెలల్లోనే 16 వేలకు కేసులు నమోదయ్యాయి.

Monkeypox: చిన్నపిల్లలకు మంకీపాక్స్ వచ్చే ప్రమాదం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
Monkeypox
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 27, 2022 | 7:55 AM

Monkeypox: ప్రపంచంలోని 71 కి పైగా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెంది. కొన్ని నెలల్లోనే 16 వేలకు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ భారత్‌లోకీ ఎంటరైంది. కేరళలో ముగ్గురు, ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారించారు వైద్యులు. అయితే, చిన్న పిల్లలకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు మశూచి టీకాలు వేయకపోవడం, వారి రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉండటం ఇందుకు కారణంగా చెబుతున్నారు. 1980లోనే మశూచి అంతమైపోయింది. ఆ తర్వాత ఎవరికీ ఈ వ్యాక్సిన్‌ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పిల్లలు ఎక్కువగా మంకీపాక్స్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అని స్పష్టం చేస్తున్నారు వైద్య నిపుణులు.

పిల్లలకు మంకీపాక్స్ సోకడంపై సఫ్దర్ జంగ్ ఆస్పత్రి డాక్టర్ జుగల్ కిశోర్ కీలక విషయాలు వెల్లడించారు. మంకీపాక్స్ ఒక వైరల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని, మశూచిని పోలిన అనేక లక్షణాలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మశూచికి సంబంధించిన టీకాలు వేయని వ్యక్తులు దీని బారిన పడే ప్రమాదం ఉందన్నారు.

ఇమ్యూనిటీ లేకపోవడం.. సాధారణంగానే పిల్లలు పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించలేరు. వైరస్ నివారణ చర్యల గురించి వారికి పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఈ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే.. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే.. మంకీపాక్స్ సోకిన వ్యక్తికి పిల్లలను దూరంగా ఉంచాలి. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలు, గుండె సంబంధిత జబ్బులు, మధుమేహం, ఇతర తీవ్రమైన వ్యాధులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

మంకీపాక్స్ లక్షణాలు.. మంకీపాక్స్ సోకిన బాధితుల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని ఢిల్లీలోని లోక్‌నాయక్‌ హాస్పిటల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. బాధితుడికి జ్వరం కూడా తగ్గిందన్నారు. అయితే, అతని శరీరంలోని చాలా భాగాలలో దద్దుర్లు ఉన్నాయి. ప్రస్తుతం రోగిని పరీక్షించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగిస్తున్నారు.

ఇప్పటి వరకు ఐదుగురు మృతి.. మంకీపాక్స్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. మృతుల సంఖ్య మాత్రం చాలా తక్కువంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆఫ్రికాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో 16 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్.. శరీరంలోని అవయవాలకు హాని కలిగించదని చెబుతున్నారు వైద్యులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..