Control Sugar Level: మధుమేహ బాధితులు ఆహారంలో పిండి పదార్ధాలు లేని కూరగాయలను చేర్చుకోవడం ఉత్తమమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. పిండి పదార్ధాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, కానీ అవి చక్కెర స్థాయిని తీవ్రంగా పెంచుతాయి. అయితే.. ఆహారంలో వాటిని తీసుకోకపోవడం ఉత్తమం. మీరు మధుమేహం (Diabetes) తో బాధపడుతుంటే.. పిండి పదార్థాలు లేని ఈ ఐదు పదార్థాలను (starchy vegetables) మీ ఆహారంలో చేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
క్యారెట్లు: శీతాకాలంలో ఎక్కువగా లభించే క్యారెట్‌లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివి. ఈ బాధితులు వండడానికి బదులు పచ్చి క్యారెట్లను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా.. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నెమ్మదిగా తగ్గిస్తుంది.
క్యాబేజీ: ఇందులో విటమిన్ల, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిక్ రోగులు వారానికి ఒకసారి క్యాబేజీని తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
వంకాయ: ఇది కూడా పిండి లేని కూరగాయ. వంకాయలో కొలెస్ట్రాల్ లేకపోవడం దీని ప్రత్యేకత. డయాబెటిక్ పేషెంట్లకు ఈ కూరగాయ దివ్యౌషధమని.. దీనిని తింటే షుగర్ లెవల్ కంట్రోల్‌లో ఉంటుందని పేర్కొంటున్నారు.
బెండకాయ: దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, లేడీఫింగర్ తొందరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులోని పోషకాలు ఇన్సులిన్ స్థాయిని గణనీయంగా పెంచుతాయి.
దోసకాయ: పీచు పదార్థాల విషయానికి వస్తే దోసకాయలో ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీటి కొరతను తీర్చే దోసకాయల ద్వారా చక్కెరను నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు దోసకాయలను ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: