Health Tips: ఆ సమస్యలతో గర్భం దాల్చలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్‌ పాటిస్తే బెటర్ అంటోన్న నిపుణులు..

PCOD సమస్యతో బాధపడుతుంటే ఆహారం, వ్యాయామం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరైన ఆహారం తీసుకోవడంతోపాటు బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా పీసీఓడీని అదుపులో ఉంచుకోవచ్చు.

Health Tips: ఆ సమస్యలతో గర్భం దాల్చలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్‌ పాటిస్తే బెటర్ అంటోన్న నిపుణులు..
Pregnant
Follow us

|

Updated on: Aug 11, 2022 | 8:33 AM

ప్రస్తుత జీవనశైలిలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఊబకాయం, జీవనశైలి వల్ల వచ్చే మరో వ్యాధి పీసీఓడీ (PCOD). మహిళల్లో పీసీఓడీ వల్ల గర్భధారణలో అనేక సమస్యలు వస్తుంటాయి. అటువంటి పరిస్థితిలో, పీసీఓడీలో గర్భం వస్తుందా అనే ప్రశ్న చాలా మంది మనసులను తొలిచేస్తుంది. ఈ వ్యాధిలో హార్మోన్లు స్త్రీల శరీరంలో వివిధ మార్గాల్లో తయారవుతాయి. దీని కారణంగా ఆండ్రోజెన్ హార్మోన్ పెరుగుతుంది. దీంతో గర్భం దాల్చడం కష్టమవుతుంది.

PCOD గర్భ సమస్యలకు దారితీస్తుందా?

పీసీఓడీతో బాధపడుతున్న స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. వారి శరీరంలో ఆండ్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. పీసీఓడీ ఉంటే గర్భం దాల్చడం సాధ్యం కాదని కొందరు మహిళలు భావిస్తారు. హార్మోన్లను నియంత్రించడం ద్వారా, మందులతో సులభంగా గర్భం దాల్చవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పీసీఓడీని ఎలా నియంత్రించాలి..

ఆహారం- మీరు ఆహారంతో PCODని నియంత్రించవచ్చు. తృణధాన్యాలు, ఆకు కూరలు, పండ్లు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఆహారంలో చేర్చండి. ఇలా తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటంతోపాటు బరువు కూడా అదుపులో ఉంటుంది.

బరువు తగ్గండి- PCOD సమస్య ఉన్నప్పుడు ఊబకాయం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, వైద్యులు మొదట బరువు తగ్గాలని సిఫార్సు చేస్తున్నారు. దీనితో పీరియడ్స్ రొటీన్‌గా వస్తాయి. శరీరంలో అండోత్పత్తి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది గర్భం దాల్చే అవకాశాలను పెంచుతుంది.

ఔషధాల వినియోగం- పీసీఓడీ ఉంటే ముందుగా డాక్టర్ని కలవండి. పీరియడ్స్ క్రమబద్ధీకరించడానికి డాక్టర్లు మీకు మందులు ఇస్తారు.