Health Tips: మారుతున్న సీజన్‌లో శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఫ్లూ, వైరల్, న్యుమోనియా వంటి సమస్యలు వస్తాయి. అయితే, ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వైద్య సాయంతో పాటు ఇంటి చిట్కాలు కూడా అద్భుతంగా ప్రభావం చూపుతాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు పాలు..
పసుపు పాలు శ్వాసకోశ సమస్యల నుంచి రిలీఫ్ ఇస్తుంది. పసుపు పాలలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
అల్లం..
శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేసే గుణం అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. చలికాలంలో లేదా వర్షాకాలంలో క్రమం తప్పకుండా అల్లం డికాక్షన్ తాగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ బలపడుతుంది.
మూలికల టీ..
వర్షాకాలంలో శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి హెర్బల్ టీ బెటర్ అని చెప్పొచ్చు. ఇది శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా దాల్చినచెక్క, అల్లం, తేనె, నిమ్మకాయలతో తయారుచేసిన టీ ఈ సీజన్‌లో ఆరోగ్యకరమైనది.
తేనె..
శ్వాసకోశ సమస్యల నుంచి బయటపడేందుకు తేనెను అద్భుత ఔషధంగా పరిగణిస్తారు. వర్షాకాలంలో, చలికాలంలో తేనె, ఎండుమిర్చి కలిపి తీసుకుంటే జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. శ్వాస సమస్యలను కూడా దూరం చేస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..