Health Tips: శరీరంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ అవడం లేదా? అయితే, ఈ వంటింటి చిట్కాను ప్రయత్నించండి..

|

Sep 03, 2021 | 6:39 AM

Health Tips: డయాబెటిక్ రోగులకు షుగర్ లెవల్స్‌ని బ్యాలెన్స్ చేయడం అతిపెద్ద సవాల్. నియంత్రణ లేని షుగర్ లెవల్స్ కారణంగా అనేక సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది.

Health Tips: శరీరంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ అవడం లేదా? అయితే, ఈ వంటింటి చిట్కాను ప్రయత్నించండి..
Health Tips
Follow us on

Health Tips: డయాబెటిక్ రోగులకు షుగర్ లెవల్స్‌ని బ్యాలెన్స్ చేయడం అతిపెద్ద సవాల్. నియంత్రణ లేని షుగర్ లెవల్స్ కారణంగా అనేక సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే శరీరంలోని షుగర్ లెవల్స్‌ని నియంత్రించడానికి మనం రోజూ తినే ఆహారం, జీవన శైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని సుగంధ ద్రవ్యాలు, మూలికలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీరంలోని షుగర్‌ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా షుగర్ కంట్రోలింగ్‌లో పసుపు బాగా పనిచేస్తుందట. పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మధుమేహం వల్ల కలిగే సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు పసుపును అనేక విధాలుగా ఉపయోగించవచ్చు.

మెంతి గింజలు డయాబెటిక్ రోగులకు మేలు చేస్తాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా, చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను, కార్బోహైడ్రేట్లను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తద్వారా చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది కాకుండా, మెంతులు గుండె సంబంధిత రోగులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

దాల్చిన చెక్కలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. యాంటీ-ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అవి శోథ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఓ అధ్యయనం ప్రకారం.. దాల్చినచెక్క టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అన్ని పదార్థాల్లోనూ దాల్చినచెక్క అత్యంత శక్తివంతమైన పదార్థం. ఎందుకంటే ఇందులో మిథైల్ హైడ్రాక్సీ చాల్‌కోన్ పాలిమర్ ఉంటుంది. ఇది గ్లూకోజ్ తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.

తులసి ఆకులను తినడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బాడీలో షుగరల్ లెవల్స్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి తులసి ఉపకరిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

Also read:

Silver Price Today: దేశీయంగా వెండి ధరలు పెరిగితే.. హైదరాబాద్‌లో తగ్గింది.. ఎంతంటే..

Aadhaar Card: ఈ సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని మీకు తెలుసా?.. పూర్తి వివరాలివే..

Ice Cream Tester: ఐస్ క్రీమ్ తినడమే ఇతని పని.. జీతం మాత్రం కోట్లలో.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజుల్ ఔట్..