Health Care Tips: వేసవి కాలం దాదాపు వచ్చేసింది. మే రాకముందే సూర్యుడు మండిపోతున్నాడు. ఇతర సీజన్లతో పోల్చుకుంటే ఆరోగ్యం పరంగా వేసవిలో (Summer) లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి (Healthy Lifestyle) అలవర్చుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శరీరానికి వేడి కలిగించే ఆహార పదార్థాలను దూరం పెడుతూనే శరీరానికి చలువ కలిగించే ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. ఇక ఎండాకాలంలో వడదెబ్బ, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, డీహైడ్రేషన్ తదితర పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీటి నుంచి ఉపశనమం పొందాలంటే శరీరాన్ని హైడ్రెటెడ్‌గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం సరైన మొత్తంలో నీరు తాగాలి. మరి వేసవిలో ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఒకసారి తెలుసుకుందాం రండి..
తేలికైన ఆహారం
సమ్మర్‌లో తేలికగా జీర్ణమయ్యే ఆరోగ్యకరమైన ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో కూడిన ఆహార పదార్థాలు శరీరంలో వేడిని పెంచుతాయి. వీటికి బదులు నీటి స్థాయులు అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. నారింజ, పుచ్చకాయ, టమోటాలను ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి.
సన్‌స్ర్కీన్‌ను అప్లై చేయండి..
వేసవిలో సూర్యరశ్మి ఎక్కువగా తగలడం వల్ల చర్మం ట్యానింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా మొటిమలు, నల్లటి మచ్చలు, దద్దుర్లు బాగా ఇబ్బంది పెడతాయి. అందుకే ఇంటి నుంచి బయటికి వెళ్లిన ప్రతిసారీ ముఖంపై సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం మర్చిపోవద్దు. తలపై టోపీ కూడా ధరిస్తే మరీ మంచిది.
నీరు..
వేడి, చెమట కారణంగా శరీరం త్వరగా డీహైడ్రేట్‌కు గురవుతుంది. ఫలితంగా త్వరగా అలసిపోతారు. ఈ క్రమంలో శరీరాన్ని
హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. అదేవిధంగా ఐస్‌డ్ టీ, హెర్బల్ టీ, సాదా నీరు, కొబ్బరి నీరు, నిమ్మకాయ, దోసకాయ ముక్కలతో కూడిన పానీయాలను బాగా తీసుకోవాలి.
తగిన విశ్రాంతి.
వేసవిలో బాడీ త్వరగా డీహైడ్రెట్ అయిపోతుంది. ఫలితంగా త్వరగా అలసిపోతారు. కాబట్టి అలసటను తగ్గించుకునేందుకు వీలుగా తగిన విశ్రాంతి తీసుకోవాలి. అలాగే బాగా నిద్ర పోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట దాదాపు 7 నుంచి 9 గంటల పాటు నిద్ర పోవాలి. ఇక రాత్రి భోజనంలో తేలికపాటి ఆహారానికే ప్రాధాన్యమివ్వాలి. తద్వారా ఆహారం త్వరగా జీర్ణమై జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది.
వ్యాయామం..
ఇక సీజన్ ఏదైనా శరీరానికి మాత్రం విశ్రాంతినివ్వకూడదు. మరీ చెమటలు కక్కేలా కాకుండా యోగా లాంటి తేలికపాటి వ్యాయామాలను తప్పకుండా జీవనశైలిలో భాగం చేసుకోవాలి. వ్యాయామాలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
Also Read:Summer Health Tips: మండుతున్న ఎండలు.. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..
Coconut Oil Benefits: పడుకునే ముందు కొబ్బరి నూనెతో ఇలా చేస్తే.. తళ్లుక్కుమనే చర్మం మీ సొంతం..