Health Tips: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే 5 అద్భుత పదార్థాలు.. రోగాలు దరిదాపులోకి కూడా రావు..!

|

Jul 13, 2023 | 5:16 PM

ఇంతకాలం తట్టుకోలేని ఎండతో జనాలు అట్టుడికిపోయారు. ఆ ఎండల నుంచి రిలాక్స్ కల్పిస్తూ ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈ వర్షాలతో పాటే.. సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. అందుకే.. ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాతావరణంలో తేమ ఉండటం కారణంగా..

Health Tips: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే 5 అద్భుత పదార్థాలు.. రోగాలు దరిదాపులోకి కూడా రావు..!
Monsoon Health Tips
Follow us on

ఇంతకాలం తట్టుకోలేని ఎండతో జనాలు అట్టుడికిపోయారు. ఆ ఎండల నుంచి రిలాక్స్ కల్పిస్తూ ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈ వర్షాలతో పాటే.. సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. అందుకే.. ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాతావరణంలో తేమ ఉండటం కారణంగా.. వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే.. మన రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం చాలా అవసరం. శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటే.. వ్యాధుల బారిన పడకుండా, ఒకవేళ వచ్చినా తీవ్రతరం కాకుండా ఉంటుంది. అయితే, ప్రకృ‌తి వ్యాధుల పెరుగుదలకు కారణం అయినట్లుగానే.. ఆ వ్యాధులను తట్టుకునేందుకు అవసరమైన, రోగనిరోధక శక్తిని పెంచే పోషక పదార్థాలను కూడా అందించింది. అవే.. మన వంటింట్లో నిత్యం వాడే సుగంధ ద్రవ్యాలు. ఇతర ఆహారాలు. వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు, రోగనిరోధక శక్తి పెంచేందుకు అవసరమైన పోషకాహారాలు, పదార్థాలు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

తులసి: హిందూమతంలోనే కాకుండా, ఆయుర్వేదంలోనూ ఔషధంగా తులసి మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది నేచురల్ ఇమ్యూన్ బూస్టర్‌గా పని చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన టి సహాయక కణాలను, సహజ కిల్లర్ కణాల కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉంచడంలో, ఇన్‌ఫెక్షన్లతో పోరాడటంలో ఈ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. తులసి ఆకులను నేరుగా తినడం గానీ, వాటిని హెర్బల్ టీలో వేసుకోవడం వల్ల గానీ, సూప్‌ తయారు చేసుకోవడం ద్వారా గానీ, కూరలలో వేసుకోవడం వల్ల గానీ ప్రయోజనం పొందవచ్చు.

అల్లం: వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడే మరొక కీలక పదార్థం అల్లం. ఈ అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు ఉన్నాయి. జింజేరోల్స్, పారాడోల్స్, సెస్క్విటెర్పెనెస్, షోగోల్స్, జింజెరోన్ వంటి సమ్మేళనాలతో కూడి ఉంటుంది. ఇది శరీర కణజాలాలకు పోషకాల సేకరణ, రవాణాను మెరుగుపరుస్తుంది. ఇది, జలుబు, ఫ్లూని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. టీ లో గానీ, సూప్‌లలో గానీ అల్లం వేసుకుని తీసుకోవచ్చు. ఇది మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

బ్లాక్ పెప్పర్/మిరియాలు: సుగంధ ద్రవ్యాల రాజు అని దీనిని పిలుస్తారు. వర్షాకాలంలో ఇది కీలకం అని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఇందులో ఉంటాయి. పైపెరిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. నల్ల మిరియాలు రెగ్యులర్‌గా తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హానికరమైన వ్యాధికారకాల నుంచి కాపాడుతుంది. అనారోగ్యం బారిన పడకుండా రక్షిస్తుంది.

కరివేపాకు: భారతీయ వంటకాల్లో ప్రధానమైనది కరివేపాకు. ఇది వేయకుండా కూర వండే అవకాశాలు చాలా తక్కువగా. కరివేపాకు కూరల టేస్ట్ పెంచడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. కరివేపాకులో లినాలూల్, ఆల్ఫా-టెర్పినేన్, మైర్సీన్, మహానింబైన్, క్యారియోఫిలీన్, ముర్రాయానోల్, ఆల్ఫా-పినేన్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండేందుకు, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

నిమ్మకాయ: విటమిన్ సి, పొటాషియం, కాల్షియం సమృద్దిగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తికి పెంచుతుంది. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. తెల్ల రక్త కణాల పునరుత్పత్తికి దోహదపడుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలిపి తాగడం వలన వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..