Benefits of Cloves: లవంగాల గురించి మీకు ఈ విషయం తెలుసా? మరెన్నో అద్భుత ప్రయోజనాలు..

|

Aug 19, 2022 | 3:11 PM

Benefits of Cloves: సుగంధ ద్రవ్యాలలో విస్తృతంగా ఉపయోగించే లవంగాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

Benefits of Cloves: లవంగాల గురించి మీకు ఈ విషయం తెలుసా? మరెన్నో అద్భుత ప్రయోజనాలు..
Cloves
Follow us on

Benefits of Cloves: సుగంధ ద్రవ్యాలలో విస్తృతంగా ఉపయోగించే లవంగాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. లవంగాలు ఉండని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ లవంగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ లవంగాలు వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. లవంగాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. బిర్యానీ గానీ, నాన్ వెజ్ వంటకాలు గానీ లవంగాలు వేయకుండా వండరు. ఎందుకంటే.. అది వేస్తే వచ్చే రుచి, వాసనే చాలా స్పెషల్. అయితే, ఈ లవంగాలు తినడం వల్లన కండరాల నొప్పిని తగ్గిస్తాయి.
2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా లవంగం నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. లవంగం మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మూత్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
3. చిగుళ్ల ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే పీరియాంటల్ పాథోజెన్స్ వంటి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. పంటి నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
4. లవంగాల్లో యూజినాల్ ఉంటుంది. ఇది దంతాలను కుళ్లిపోకుండా కాపాడుతుంది. సైనస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
5. లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున, జలుబు మరియు దగ్గు వంటి ఇన్‌ఫెక్షన్ల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి.
6. కడుపు ఉబ్బరం, అజీర్తి, విరేచనాలు, మలబద్ధకం, గ్యాస్, ఆకలి లేకపోవడం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. లవంగాలు శరీరంలో ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి. ఇది జీర్ణవ్యవస్థ, పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
7. లవంగాలను తీసుకోవడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే, శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. లవంగాల వాడకం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. లవంగం నూనెలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమల సమస్యను నయం చేస్తుంది.
8. ఆయుర్వేదం ప్రకారం కఫం సమస్యను తగ్గించడానికి లవంగం మంచి పదార్థం. దీన్ని మితంగా తీసుకోవడం వల్ల వాంతులు, వికారం, రక్త సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్షయం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే, పురుషుల లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక: పై కథనాన్ని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ సమాచారం మత్రమే అందివ్వడం జరిగింది. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మేలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..