Toothache: ఆకస్మిక పంటినొప్పితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యకు కారణం మనమే. ఎందుకంటే ఆహారం తిని బ్రష్ చేసుకోకపోవడం, రాత్రిపూట స్వీట్లు తినడం చేస్తుంటాం. అయితే పంటి నొప్పిని సాధారణ ఇంటి నివారణల సహాయంతో చికిత్స చేయవచ్చు. కానీ తీవ్రమైన పంటి నొప్పికి మాత్రం వైద్యుడిని సంప్రదించడం అవసరం. ఈ 5 హోం రెమిడిస్ ద్వారా కొంతవరకు పంటినొప్పిని తగ్గించవచ్చు.
1. ఉప్పు నీరు
పంటి నొప్పిని తగ్గించడానికి ఉప్పునీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా వేడినీటిలో ఉప్పు కలుపుకొని ఈ నీటితో నోరు పుక్కిలించాలి. ఇది సహజ క్రిమిసంహారిణి వెంటనే మీ పంటినొప్పిని తగ్గిస్తుంది.
2. ఐస్
మీ పంటి నొప్పిని నయం చేయడానికి మరొక సులభమైన మార్గం ఐస్ పెట్టడం. మీకు నొప్పి అనిపించే చోట ఐస్ ప్యాక్‌తో నొక్కండి. ఐస్ ఆ ప్రాంతాన్ని క్లీన్ చేస్తుంది అంతేకాదు నొప్పిని తగ్గిస్తుంది.
3. లవంగాలు
పంటి నొప్పికి లవంగంతో చికిత్స చేయడం ఒక ప్రాచీన పద్ధతి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు లవంగ నూనెను తీసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయవచ్చు. ఇది ఖచ్చితంగా మీకు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
4. పుదీనా
పుదీనా టీ బ్యాగులు పంటి నొప్పిని తగ్గిస్తాయి. గోరువెచ్చని టీ బ్యాగ్స్‌ని పంటినొప్పి ప్రాంతంలో కొద్దిసేపు పెట్టాలి. ఇది నొప్పిని తగ్గిస్తుంది.
5. వెల్లుల్లి
వెల్లుల్లిలో సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వెల్లుల్లిని చూర్ణం చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయవచ్చు లేదా వెల్లుల్లి ముక్కను నమలవచ్చు. ఇది నొప్పి, వాపును తక్షణమే తగ్గిస్తుంది.