Esophageal Cancer: చాలా మంది ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి వేడి వేడి టీ తాగుతుంటారు. ఇక పని ప్రదేశాల్లోనూ, బయటకి సరదాగా వెళ్లినప్పుడు కూడా టీ లేదా కాఫీ తాగుతుంటారు. మొత్తంగా రోజుకు కనీసం మూడు సార్లైనా టీ, కాఫీ తాగుతారు. అయితే, వీరిలోనూ చాలా మందికి టీ తాగేటప్పుడు ధూమపానం చేసే అలవాటు ఉంటుంది. టీ తాగుతూ ధూమపానం చేస్తుంటారు. అలా ఎందుకు తాగుతారంటే.. రిలాక్స్‌గా ఉంటుందని సమాధానం చెబుతుంటారు. అయితే, టీ తాగుతూ ధూమపానం చేయడం అరోగ్యానికి అత్యంత హానీకరం అని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగానే ధూమపానం క్యాన్సర్‌కు కారణం. అలాంటి తరుణంలో ధూమపానం చేస్తూ టీ సేవించడం మరింత ప్రమాదకరం అని ఇటీవల ఒక అధ్యయనం తేల్చింది. టీ, సిగరెట్ కలయిక ఆరోగ్య ప్రమాదాలను మరింత రెట్టింపు చేస్తుందని పేర్కొన్నారు.
మెడికల్ జర్నల్ అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక చైనీస్ అధ్యయనం ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రతి రోజూ ధూమపానం, మద్యం సేవించే వ్యక్తులకు అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. పరిశోధకులు 30-69 సంవత్సరాల వయస్సు గల 4,56,155 మందిపై సుమారు 9 సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. వేడి వేడి చాయ్, ఆల్కహాల్, ధూమపానం చేసే వారిలో అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఐదు రెట్లు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
నేషనల్ నేచురల్ సైన్స్ ఫౌండేషన్ ఆఫ్ చైనాకు చెందిన డాక్టర్ కాంకింగ్ యు నేతృత్వంలోని బృందం, అధిక వేడిగా ఉండే టీ తాగడంతో పాటు మద్యం, ధూమపానం అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని కనుగొన్నారు. ‘‘చైనా కంటే పశ్చిమ దేశాల్లోని ప్రజలు తక్కువ ఉష్ణోగ్రత కలిగిన టీ తాగుతాము.’’ అని మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఆండ్రూ షార్క్స్ చెప్పారు. ఇది అన్నవాహికకు హానీ తలపెట్టదన్నారు. అయితే, ఈ అధ్యయనం చైనా జనాభాకు సంబంధించినది అయినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చైనాలో కంటే ఎక్కువ వేడిగా ఉన్న టీ లను తాగేవారు కూడా ఉన్నారు. తక్కవ వేడి ఉన్న తేనీరుని తాగితే తక్కువ ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు పరిశోధకలు.
పొగాకు, ఆల్కహాల్ రెండూ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడానికి దోహదపడుతాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ధూమపానం, మద్యపాన అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. అందులోనూ వేడి వేడి టీ తాగుతూ ధూమపానం చేస్తున్నట్లయితే.. ఆ అలవాటును మానుకోవడానికి ప్రయత్నం చేయండని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అనారోగ్య సమస్యలు తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
Also read:
PM Modi: కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక శైలి.. పూజారులతో కలిసి డమ్రు మోగించిన మోడీ
Andhra Pradesh: మరో సోషల్ మీడియా సంచలనం.. మన ఒంగోలు వ్యక్తే.. స్పెషాలిటీ ఏంటంటే..?