Shocking video: వేగంగా వెళ్తున్న బస్సుపై కుప్పకూలిన భారీ వృక్షం.. షాకింగ్ దృష్యాలు ఈ వీడియోలో చూడండి..
యూకేలో యూనిస్ తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది. ఈదురు గాలులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటకు 100 మైళ్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులకు జనం చిన్నాభిన్నమవుతున్నారు. పెద్ద పెద్ద చెట్లు నేల కూలిపోతున్నాయి. ఇక గాలుల ధాటికి విమానాలు సైతం గాలి
యూకేలో యూనిస్ తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది. ఈదురు గాలులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటకు 100 మైళ్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులకు జనం చిన్నాభిన్నమవుతున్నారు. పెద్ద పెద్ద చెట్లు నేల కూలిపోతున్నాయి. ఇక గాలుల ధాటికి విమానాలు సైతం గాలి పటాల్లా ఊగిపోతున్నాయి. ఈ తుఫాన్ కారణంగా 436 విమాన సర్వీసులను అధికారులు తాత్కలికంగా రద్దు చేశారు. సెంట్రల్ అట్లాంటిక్‌లో ఏర్పడిన యూనిస్ తుఫాను కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇదిలా ఉంటే యూనిస్ తుఫాన్ సృష్టిస్తోన్న బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ వీడియో వీక్షకులను షాక్‌కు గురి చేస్తోంది. తఫాన్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతోంది ఆ వీడియో. యూకేలోని రోడ్డుపై ఓ బస్సు వేగంగా దూసుకెళ్తోంది. ఆ సమయంలో గాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో రోడ్డు పక్కన ఉన్న ఓ పెద్ద వృక్షం ఒక్కసారిగా ఆ బస్సుపై కుప్ప కూలిపోయింది. దీంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే చెట్టు బస్సు ముందు భాగంలో పడడంతో పెద్దగా నష్టం జరిగినట్లు కనిపించడం లేదు. అదే ఒకవేళ మధ్యలో పడితే మాత్రం ప్రమాద తీవ్రంగా ఉండేది. ఇదంతా ఎదరుగా వస్తున్న మరో వాహనంలో ఉన్న కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే క్షణాల్లో వైరల్‌గా మారింది. మరి ఆ షాకింగ్ వీడియోను మీరూ చూడండి..
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

