Health Benefits: పసుపులోని ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే.. ఉపయోగించే విధానం మార్చేయండి..!

|

Jun 25, 2022 | 8:11 PM

అయితే పసుపులో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ పసుపును సరిగ్గా ఉపయోగించని కారణంగా దానివల్ల కలిగే ప్రయోజనాలను అందుకోలేకపోతున్నారు. చాలా మంది రంగు కోసమని

Health Benefits: పసుపులోని ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే.. ఉపయోగించే విధానం మార్చేయండి..!
Turmeric Side Effects
Follow us on

వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా వాడుతున్నారు. భారతదేశంలోని హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మనదేశంలో పసుపు లేని, వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే.. ప్రథమ చికిత్స కోసం సాధారణంగా ఉపయోగించే పదార్థాలలో పసుపు ఒకటి. వేదాలు, పురాణాల నుండి ఆయుర్వేదం వరకు ఆదిక ప్రాధాన్యత ఉంది. నేటి ఆధునిక జగత్తులో కూడా పసుపును అధికంగా ఉపయోగిస్తున్నారు.

అయితే పసుపులో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ పసుపును సరిగ్గా ఉపయోగించని కారణంగా దానివల్ల కలిగే ప్రయోజనాలను అందుకోలేకపోతున్నారు. చాలా మంది  రంగు కోసమని వంటలో పసుపును ఉపయోగిస్తారు. చాలా తక్కువ మందికి మాత్రమే పసుపు ఉపయోగాల గురించి తెలుసు. పసుపులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీలు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు యాభైకి పైగా ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పసుపు ఉపయోగపడుతుంది. కానీ రుచి, రంగును దృష్టిలో ఉంచుకుని పసుపును వంటలలో వాడుతుంటారు. అయితే పసుపు ఉపయోగంలో కొద్దిగా మార్పు చేస్తే, రుచి, రంగుతో పాటు శరీరానికి ఆర్యోగానికి కూడా తోడ్పడుతుంది. శరీరానికి సరిగ్గా ఇముడుతుంది.

కూరగాయలు లేదా పప్పులను వేయించేటప్పుడు, పాన్‌లో నూనె వేయడానికి కంటే ముందు పసుపును అవసరమైన విధంగా వేసి నూనెలో కరిగించాలి. రోజులో 5-8 గ్రాములు అంటే ఇంచుమించు 2 టీస్పూన్ల వరకు పసుపును ఉపయోగించవచ్చు. టీ, పాలు లేదా గ్లాసు నీటిలో అర టీస్పూన్ అంటే దాదాపు2 గ్రాముల వరకు పసుపు, 2 చిటికెల ఎండుమిరియాల పొడి వేసి రోజు తాగాలి. నల్ల మిరియాలతో కలిపి పసుపు తీసుకుంటే శరీరంలో అవసరమయ్యే భాగాలకు ఈజీగా చేరుతుంది. నల్ల మిరియాలు పసుపు జీవ లభ్యతను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి