Health Benefits Of Coconut Milk: వేసవిలో కొబ్బరి నీరు తాగడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. దీంతోపాటు ఎన్నోపోషకాలు లభిస్తాయి. అయితే.. కొబ్బరి పాలు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందనేది చాలా తక్కువ మందికి తెలుసు. అయితే.. కొబ్బరి పాలు అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. వీటిలో చాలా పోషకాలు ఉన్నాయి.. కొబ్బరి పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే తురుమిన కొబ్బరిలో నీటిని పోసి, ఆ రెండింటి మిశ్రమాన్ని మిక్సిలో పట్టి వడబోసి కొబ్బరి పాలను తీస్తారు. అయితే కొబ్బరి పాలలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి 1, 3, 5, 6, ఐరన్, సెలీనియం, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పుష్కలంగా ఉన్నాయి. ఈ పాలను స్వీట్స్, అనేక ఇతర వంటలలో ఉపయోగిస్తారు.
కొబ్బరి పాలు.. ఎముకలను దృఢంగా చేస్తాయి. ఇందులో కాల్షియం, రియు భాస్వరం అధికంగా ఉంటాయి.
కొలెస్ట్రాల్ నియంత్రణ
కొబ్బరి పాలలో కొవ్వును కరిగించే పోషకాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో లారిక్ ఆమ్లం ఉండటం వల్ల మంచి కొలెస్ట్రాల్ పరిణామం పెరుగుతుంది.
రోగనిరోధక శక్తి
కొబ్బరి పాలలో యాంటీ ఫంగల్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. శరీరంలోని వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడటానికి ఇవి సహాయపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
మెగ్నీషియం
కొబ్బరి పాలలో మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి కండరాలకు మంచిది.
బరువు తగ్గడానికి
కొబ్బరి పాలు కొవ్వును కరిగిస్తుంది. దీంతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉంది. దీనివల్ల బరువు తగ్గుతుంది.
జుట్టు..
కొబ్బరి పాలతో 5 నిమిషాలపాటు జట్టుకు మసాజ్ చేస్తే.. జుట్టు బలంగా మారుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. దీంతో జట్టు సమస్యలు కూడా తొలగిపోతాయి.
ఆర్థరైటిస్ చికిత్స
కొబ్బరి పాలలో సెలీనియం అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్ల నొప్పి, ప్రోస్టేట్ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: